HBD: సల్మాన్ ఖాన్ కు టాలీవుడ్ నుంచి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?

Divya
బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన సల్మాన్ ఖాన్ తన సినీ కెరియర్లో ఎలాంటి పాత్రలోనైనా సరే, ఎంతటి రిస్క్ అయినా సరే చేయడానికి సిద్ధంగానే ఉంటారు. అందుకే సల్మాన్ ఖాన్ ని కండల వీరుడు, భాయ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజున సల్మాన్ ఖాన్ 59వ పుట్టినరోజు సందర్భంగా ఈయన గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ కి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు ఇష్టం అనే విషయంపై ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది వాటి గురించి చూద్దాం.


టాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి ఇష్టమైన హీరోలలో చిరంజీవి ,రామ్ చరణ్, వెంకటేష్, మహేష్ బాబు ఉన్నారట. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో అడగగానే చిన్న పాత్రని గెస్ట్ రోల్ లో ఒప్పుకున్నారట .అంతేకాకుండా వీటికి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని టాక్ అప్పుడు ఎక్కువగా వినిపించింది. హీరో వెంకటేష్, రామ్ చరణ్ కూడా సల్మాన్ ఖాన్ సినిమాలో గెస్ట్ రోల్ తో ఎంట్రీ ఇచ్చి సల్మాన్ ఖాన్ తో కలిసి స్టెప్పులు వేయడం జరిగింది. ఇక మహేష్ బాబు సినిమా స్టోరీలు తనకి బాగా నచ్చుతాయని కూడా తెలిపారు.

అలాగే తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే కూడా చాలా ఇష్టమని ఏన్నో సందర్భాలలో తెలిపారు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ హీరోయిన్స్ తో కూడా ఎఫైర్స్ నడిపారని రూమర్స్ ఇప్పటికే వినిపిస్తూ ఉంటాయి సల్మాన్ ఖాన్ ప్రవర్తన నచ్చకే వారి విడిపోయారని వార్త వినిపిస్తూ ఉంటాయి. మరి సల్మాన్ ఖాన్ వచ్చే ఏడాది అయిన పెళ్లి ప్రకటన ఉంటుందేమో అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒక్కో చిత్రానికి కొన్ని కోట్లు తీసుకోవడమే కాకుండా.. బిగ్ బాస్ హింది షోకి అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకున్న హోస్ట్ గా పేరు సంపాదించారు.. సల్మాన్ ఖాన్ ఆస్తి 3000 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.సల్మాన్ ఖాన్ ను కొంతమంది దుండగులు ఇప్పటికీ బెదిరిస్తూ ఉన్నారు. ఇలా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు సల్మాన్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: