మహాభారతంలో ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ మహేశ్ సహా ఆ స్టార్స్.. క్యారెక్టర్స్ ఇవే!

MADDIBOINA AJAY KUMAR
ఏఐ అత్యంత వేగంగా అబివృద్ది చెందుతూ వస్తుంది. ఏఐ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడమే కాదు మరెన్నో చేస్తుంది. నేడు కోట్లాది మంది ఈ ఏఐని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సినీ రంగంలో కూడా ఏఐని పలు పనుల్లో ఉపయోగిస్తున్నారు. ఇటీవల ఏఐ సహాయంతో ఓ మహాభారతం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోలో ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు ఇతర హీరోలు మహాభారతంలో నటిస్తే ఎలా ఉంటుంది అని ఎడిట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు దుమ్ము లేపుతుంది. ఇక ఆ వీడియోలో ఏ స్టార్ హీరో.. ఏ క్యారెక్టర్ లో ఉన్నారో చూద్దాం రండి.
ఈ మహాభారతం వీడియోలో పాండవ ద్వితీయుడు, వాయుదేవుని అంశమున జన్మించిన అమితబలశాలి భీముడిగా నందమూరి తారక రామరావు (ఎన్టీఆర్) ఉన్నాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాండవులలో పెద్దవాడు, కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించిన ధర్మరాజు క్యారెక్టర్ లో కనిపించడు. తన జీవితాంతం కర్మను నమ్మిన కర్ణుడి రూపంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కనిపించడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మహాభారతంలో మార్గదర్శకుడిగా, ఆధ్యాత్మిక గురువుగా ఉన్న కృష్ణుడి పాత్రలో కనిపించగ.. అస్త్రవిద్యలో తిరుగులేని వీరుడు అర్జునుడి రూపంలో మెగా హీరో రామ్ చరణ్ మెరిసాడు. అలాగే అశ్వినీ దేవతల వరముగా మాద్రి కి జన్మించిన నకులుడిగా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సహదేవుడిగా న్యాచురల్ స్టార్ నాని కనిపించారు. ఇక చివర్లో దగ్గుబాటి రానా ధృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో ప్రథమ పుత్రుడు దుర్యోధనుడిగా మెరిశాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ వీరందరూ ఇవే క్యారెక్టర్స్ లో మహా భారతం తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుందని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు అయితే మహాభారతాన్ని చూసిన ఫీల్ వస్తుందంటూ తెగ సంబరపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: