ఆ మాటకే కట్టుబడి ఉన్న రేవంత్..తగ్గితే తలఓంపులు ?
ఐటీ, ఫార్మతో పాటు తమకు సినిమా పరిశ్రమ కూడా చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును అనౌన్స్ చేశామని వెల్లడించాడు. ప్రభుత్వం సినిమా పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్ డీ సి చైర్మన్ గా నియమించామని చెప్పాడు. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.
సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణకు టాలీవుడ్ సినీ పెద్దలు అందరూ సహకరించాలని చెప్పాడు. అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీదేనని వెల్లడించాడు. ఇకపై బెన్ ఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని రేవంత్ రెడ్డి అన్నాడు. శాంతి భద్రతల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్న చిత్ర పరిశ్రమను ప్రోత్సాహిస్తం పద్ధతిగా ఉండండి అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సీఎం పేరు చెప్పనందుకే కేసు అని ప్రచారం చేస్తారా...? ఎప్పుడో ఆ స్థాయి దాటాం..... మీరెందుకు ఖండించలేదంటూ ప్రశ్నించారు. దేశంలోని కాస్మోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ చాలా ఉత్తమమైనది. ఇకనుంచి హాలీవుడ్, బాలీవుడ్ వారు కూడా హైదరాబాద్ కు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇందుకోసం త్వరలో హైదరాబాద్ లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే..ఇకపైన బెన్‌ఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకోవడంపై రేవంత్ వెనక్కి తగ్గితే... ఆయన గ్రాఫ్ అమాంతం పడిపోతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. రేవంత్ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.