హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024 : కుర్చీ మడతబెట్టి సాంగ్ తో అదరగొట్టిన శేఖర్ మాస్టర్.. ఆ స్టెప్పులు మాత్రం వేరే లెవెల్!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరనే సంగతి తెలిసిందే. చాలామంది కొరియోగ్రాఫర్లతో పోల్చి చూస్తే శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉంది. అయితే కుర్చీ మడతబెట్టి సాంగ్ కు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో శేఖర్ మాస్టర్ అదరగొట్టారనే చెప్పాలి. ఈ సాంగ్ లో స్టెప్పులు మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు. మహేష్, శ్రీలీల ఈ సాంగ్ లో తమ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టారు.
 
గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి మ్యాజిక్ చేయడానికి ఈ సాంగ్ కూడా కారణమని చెప్పవచ్చు. కుర్చీ మడతపెట్టి వీడియో సాంగ్ కు యూట్యూబ్ లో ఇప్పటివరకు ఏకంగా 526 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ రేంజ్ లో వ్యూస్ రావడం కూడా సాధారణ విషయం కాదనే సంగతి తెలిసిందే. ఈ సాంగ్ నటి శ్రీలీలకు సైతం మంచి పేరును తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు.
 
కుర్చీ మడతబెట్టి సాంగ్ ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత సినిమాలతో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది. మహేష్ రాజమౌళి కాంబో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించే కాంబో అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి మహేష్ తో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
 
సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవడం పక్కా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో సినిమాకు బడ్జెట్ లిమిట్స్ లేకపోవడంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మన దేశంలో 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా ఈ సినిమా నిలవనుందని తెలుస్తోంది. త్వరలో మహేష్ జక్కన్న కాంబో సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయని భోగట్టా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: