మ‌హేష్‌బాబు - రాజ‌మౌళి సినిమా నుంచి బిగ్ హాట్ టాపిక్ వ‌చ్చేసింది..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో 29వ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వం లో వచ్చిన గుంటూరు కారం సినిమా లో నటించిన మహేష్ ఈ సినిమాతో తన స్థాయికి తగ్గ హిట్టయితే అందుకోలేకపోయాడు. మహేష్ బాబు కెరీర్లో తొలిసారి రాజమౌళి దర్శకత్వంలో అందులో ను పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ ఉండడంతో మహేష్ బాబు 29వ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను చిత్ర యూనిట్ సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ఆఫ్రికా అడవులు నేపథ్యంలో సాగే ఈ సినిమా ను గ్లోబల్‌ స్థాయిలో తెరకెక్కిస్తూ ఉండడంతో గ్లోబల్ ప్రజెన్స్‌ ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నాడట. దీంతో ఈ సినిమా కు ప్రియాంక చోప్రా అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందని మేకర్స్ ఆమెను ఓకే చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో ? తెలియాలి అంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సి ఉంది. అది ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత డాక్టర్ కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. దాదాపు రు. 1000 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో నే వెల్ల‌డి కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: