మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన “ఈగల్ “ మూవీ ఫిబ్రవరి 9 న రిలీజ్ అయింది.. భారీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.. ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు..’ఈగల్’ ప్లాప్ తో డీలా పడ్డ ఫ్యాన్స్ కి మాస్ మహారాజ్ మరో గిఫ్ట్ ఇచ్చారు.. అదే ఏడాది రవితేజ నటించిన బిగ్గెస్ట్ మాస్ మూవీ “ మిస్టర్ బచ్చన్ “ కూడా రిలీజ్ అయింది...టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..అయితే ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశ తప్పలేదు.. మిస్టర్ బచ్చన్ సైతం ఘోర పరాజయాన్ని చవిచూసింది..
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ “రైడ్ “ సినిమా ను హరిష్ శంకర్ రీమేక్ గా తెరకెక్కించారు.. కానీ ఫలితం నిరాశపరిచింది.. అయితే సినిమా దెబ్బేసినా సినిమా లో సాంగ్స్ మాత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.. ముఖ్యంగా ఈ సినిమాలో “నల్లంచు తెల్ల చీర “ సాంగ్ అదిరిపోతుంది..ఇప్పటికీ ఈ సాంగ్ ట్రెండింగ్ లో వుంది.. ఈ సినిమాకు “మిక్కి జె మేయర్” మ్యూజిక్ అందించాడు..మెలోడీస్ లో ఎక్స్పర్ట్ అయిన మిక్కి ఇంతటి మాస్ ఆల్బమ్ ఇచ్చారంటే ఎవ్వరూ నమ్మలేకపోయారు.. అయితే ఈ సాంగ్ లో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ అద్భుతమైన స్టెప్స్ తో అదరగొట్టాడు.. కొరియోగ్రాఫర్ “భాను మాస్టర్ “ ఈ సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ అందించారు.. సాంగ్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా స్టెప్స్ ఆదరగొట్టేసాడు..భాను మాస్టర్ గతంలో గుంటూరు కారం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలకి కొరియోగ్రఫీ అందించాడు..