గేమ్ ఛేంజర్ : మరో రివ్యూ.. ఈసారి సుకుమార్ చెప్పిందానికి టోటల్ రివర్స్..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చరణ్ కొంత కాలం క్రితం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో చరణ్ కు ఈ మూవీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. తాజాగా చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. కొంతకాలం క్రితమే ఈ మూవీ బృందం వారు డల్లాస్ లో ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. డల్లాస్లో నిర్వహించిన ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ ఈ సినిమా చిరంజీవి తో కలిసి నేను చూశాను. ఈ మూవీ ఫస్ట్ స్టాప్ సూపర్ , ఇంట్రవెల్ సీన్ అద్భుతం. క్లైమాక్స్ ఎక్సలెంట్. టోటల్ గా ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుంది. ఈ సినిమాలోని చరణ్ యాక్టింగ్ కి నేషనల్ అవార్డు కూడా వస్తుంది అని ఆయన చెప్పుకొచ్చాడు. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ రివ్యూ ప్రకారం ఈ సినిమా ఫస్టాఫ్ అబౌవ్ యావరేజ్ అని , సెకండ్ ఆఫ్ ఎక్సలెంట్ అని , అలాగే చరణ్ ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటాడు అని ఓ రివ్యూ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో , ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: