90 వ దశకంలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో దివ్య వాణి ఒకరు. ఈమె 90 వ దశకంలో ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ ఉన్న కెరియర్ ను కొనసాగించింది. ఈమె అనేక తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి మాత్రం ఎదగలేక పోయింది. ఇకపోతే ఈమె తన కెరీర్ లో చాలా సినిమాల అవకాశాలను చేజార్చుకున్నట్లు చెప్పుకొచ్చింది.
అలాగే కొన్ని సినిమాల ద్వారా తనకు అన్యాయం జరిగినట్లు కూడా చెప్పింది. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన కొండవీటి దొంగ సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగింది అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె మాట్లాడుతూ ... చిరంజీవి హీరో గా రూపొందున కొండవీటి దొంగ సినిమాలో విజయశాంతి , రాధ హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమాలో నేను కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించాను. ఆ సినిమాలో శుభలేఖ రాసుకున్న సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇకపోతే ఆ సినిమా మొదలు అయిన సమయంలో ఆ పాటను నాపై చిత్రీకరించనున్నట్లు మేకర్స్ చెప్పారు.
దానితో నేను ఎంతో సంతోష పడ్డాను. చిరంజీవి లాంటి హీరో పక్కన సాంగ్ చేస్తే కెరీర్ కు అద్భుతంగా ఉపయోగపడుతుంది అనుకున్నాను. కానీ సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ సినిమాలో ఆ పాటలో నన్ను కాకుండా రాధను తీసుకున్నారు. అలా నా దగ్గరకు వచ్చిన నాకు దూరం అయ్యింది. అంత గొప్ప పాటలో అవకాశం కోల్పోయినందుకు నేను చాలా బాధపడి ఏడ్చేసాను అని తాజాగా దివ్య వాణి చెప్పుకొచ్చింది.