టిల్లు స్క్వేర్: 'రాదికా...రాదికా' అంటూ యూత్ ను ఊర్రుతలూగించి హైలేట్ గా నిల్చిందిగా.!
రాధిక పాట ఆకర్షణీయమైన బీట్‌ను కలిగి ఉంటుంది.రామ్ మిరియాల తన విలక్షణ శైలిలో పాటను స్వరపరచడమే కాకుండా తానే స్వయంగా ఆలపించారు. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. రామ్ మిరియాల సంగీతం, గాత్రం, కాసర్ల శ్యామ్ సాహిత్యం కలిసి ఈ పాట అద్భుతంగా ప్రేక్షకులను అక్కట్టుకుంది.డీజే టిల్లు తో రాధిక పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. అంతగా జనాదరణ పొందిన రాధిక పేరుతో వచ్చిన ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకసారి వినగానే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే అంతగా ఈ పాట బాగుంది. ఈ పాట ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని టాప్ 10 చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది అనడంలో సందేహం లేదు.ఇక ఈ పాటకి భాను మాస్టర్ కోరియోగ్రాఫ్ చేసారు.డీజే టిల్లు టైటిల్ సాంగ్ ను కూడా భాను మాస్టరే కోరి్యోగ్రాఫ్ చేసారు.ఇంకా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి కి వర్క్ చేశారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో స్పెషల్ సాంగ్ మోత మోగిపోద్ది చేశారు. ఆయన సీతా కళ్యాణ వైభోగమే సినిమాలో ఓ పాటకు కూడా కొరియోగ్రఫీ చేశారు.ఇక రాధికా పాట థియేటర్లతో పాటుగా సోషల్ మీడియాని కూడా షేక్ చేసింది. పార్టీలలో, పెళ్లిళ్లలో, కాలేజ్ ఈవెంట్స్ లో, ఉరేగింపులలో ఎక్కడ చూసిన ఈ పాటే వినిపించింది. ఈ క్రమంలో లోనే ఈ పాట యూత్ కి బాగా ఎక్కేసింది. ఎక్కడ డీజే ప్లే చేసిన రాధికా పాట ఉండాల్సిందే అనే రేంజ్ లో ట్రెండ్ అయింది.