బాలీవుడ్ మీడియాకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చిన కీర్తి సురేష్.. దెబ్బకు పరార్..!
మలయాళ నిర్మాత జి సురేష్ అలనాటి హీరోయిన్ మేనక దంపతుల కుమార్తె కీర్తి సురేష్ .. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో కీర్తికి చాలా త్వరగానే సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయి .. కానీ అవి కేవలం అరంగేట్రం వరకే హీరోయిన్ అయ్యాక వరస పరాజయాలు ఆమె ఖాతాలో పడి ఐరన్ లెగ్గానే ట్యాగ్ను తెచ్చుకుంది. కానీ కటోరీ శ్రమతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన కీర్తి సురేష్ తరవాత స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో నేను శైలజ సినిమా తో తొలి బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది.. తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలోనే మహానటి సావిత్రి జీవిత కథతో తెర్కక్కిన సినిమాలో సావిత్రిల అద్భుతమైన నటనతో కీర్తి సురేష్ మెప్పించింది .. అంతేకాకుండా ఈ సినిమాకి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకుంది.
అయితే మహానటి తర్వాత ఆమె చేసిన సినిమాలు ఒకదానికొకటి నిరాశపరిచాయం.. ఇదే క్రమంలో గత ఏడాది వచ్చిన దసరా, మామన్నన్ సినిమాలతో తిరిగి ఫామ్ లోకి వచ్చింది కీర్తి సురేష్ .. ఇక ఈ సంవత్సరం సైరన్, రఘు తాత సినిమాల్లో నటించింది.. ఇక ప్రస్తుతం రెవాల్వర్ రీటా, కన్నెవీడి ఉప్పుకప్పురంబు సినిమాలో నటిస్తున్నారు.. అలాగే బేబీ జాన్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే కిర్తి సురేష్ బాలీవుడ్లో నటించిన బేబీ జాన్ మూవీ రిలీజ్ సందర్భంగా పలు ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు.. ఇదే క్రమంలో మీడియా ప్రతినిధులు ఆమెను కృతి అని పిలవగా.. నా పేరు కీర్తి సురేశ్ అని 'కృతి' కాదని చెప్పారు. అనంతరం ఒక కెమెరామెన్ ఆమెను 'కీర్తి దోశ" అని పిలవగా... కీర్తి దోశ కాదు.. కీర్తి సురేశ్ అని చెప్పి నాకు దోశ చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఇలా కీర్తి సురేష్ బాలీవుడ్ మీడియా ప్రతినిధులకు అదిరిపోయే సెటైర్లు వేసింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.