చచ్చిన 2024ని ఈ తెలుగు హీరోలు అస్సలు మర్చిపోలేరు.. ఎందుకంటే..?

Thota Jaya Madhuri
అయిపోయింది 2024 మరి కొద్ది రోజుల్లోనే ముగియబోతుంది . ఈ సంవత్సరం చాలా మంచి జరిగింది . అదేవిధంగా చెడు కూడా జరిగింది . ప్రతి ఒక్కరి లైఫ్లో 2024 కొన్ని తీపి జ్ఞాపకాలను కొన్ని చేదు జ్ఞాపకాలను అందించే వెళ్ళిపోతుంది . 2025 రాబోతుంది . 2025 లో అంత హ్యాపీగా ఉండాలి అని 2024లో జరిగిన నెగిటివిటీ మొత్తం 2025 లో పాజిటివిటీగా మార్చేయాలి అని చాలామంది కోరుకుంటున్నారు . కొత్త ఆశలతో కొత్త ఊహలతో కొత్తగా 2025 ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ సభ్యులు కూడా 2024ని గుర్తు చేసుకుంటున్నారు.


2024 లో కొంతమంది స్టార్స్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు . అయితే 2024 మాత్రం ముగ్గురు స్టార్స్ కు బాగా ఎక్కువ నెగిటివిటీ క్రియేట్ చేసి పెట్టింది . ఎంతలా అంటే వాళ్ళ ఫ్యూచర్ మొత్తంలో కూడా ఈ 2024 ని ఎప్పటికీ మర్చిపోలేరేమో అన్న రేంజ్ లో క్రియేట్ చేసింది . వాళ్ళల్లో ముఖ్యంగా అల్లు అర్జున్ ..పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ 2024 డిసెంబర్లో 13 జైలుకు వెళ్లాడు. డిసెంబర్ నాలుగు న ఆయన నటించిన పుష్ప సినిమా రిలీజ్ అయింది . ఆల్ ఇండియన్ సినిమా హిస్టరీ రికార్డును బ్రేక్ చేసింది.


అయినా ఆయనకు ఆనందమే మిగలకుండా పోయింది. కొన్ని ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్న బన్నీ జైలుకు వెళ్ళాడు . ఇది ఆయన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది . ఆ తరువాత మోహన్ బాబు . డిస్ప్లేన్.. పంచువాలిటీ అంటూ క్రమశిక్షణ కి మారో మారుపేరు అంటూ పిలిపించుకునే మోహన్ బాబు కూడా ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నారు . ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్ ఒక ప్రాబ్లం అయితే మెడియా రిపోర్టర్ ని కొట్టడం ఆయనకి నెగిటివ్గా మారింది . ఈ విషయంలో ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . జైలుకు కూడా వెళ్లే పరిస్థితులు రాబోతున్నాయి అంటున్నారు సినీ ప్రముఖులు.


ఇక ఎన్టీఆర్. ఎప్పుడూ కూడా కాంట్రవర్షియల్ కి దూరంగా ఉండే ఎన్టీఆర్ ను కావాలనే కొంతమంది పొలిటిషియన్స్ ఊహించని చిక్కుల్లో ఇరుక్కునేలా చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేశారు . అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం టిడిపికి వైసిపికి ఎవరికి సపోర్ట్ చేయలేదు . నాకు పాలిటిక్స్ ఏ వద్దు రా అంటూ దూరంగా ఉన్నారు. అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ పేరును పొలిటికల్ పరంగా లాగుతున్నారు కొందరు ఆకతాయిలు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి సపోర్ట్ చేయకపోయినా సరే టిడిపి భారీ మెజారిటీతో అధికారం చేపట్టింది అంటూ అప్పట్లో తారక్ ని ట్రోల్ చేశారు . ఆ తర్వాత "దేవర" విషయంలో కూడా దారుణాతి దారుణమైన ఫ్లాప్ టాక్ అందుకుంది . ఇలా ఒకపక్క సినిమాల పరంగా మరొక పక్క పర్సనల్ క్యారెక్టర్ పరంగా ఆయన పేరు పై సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోల్లింగ్ జరిగింది. 2024వ సంవత్సరంలో ఈ ముగ్గురు హీరోలే టాలీవుడ్ నుంచి అత్యధిక నెగిటివిటీ క్రియేట్ చేసుకుని ట్రోల్లింగ్ కి గురయ్యారు. అయితే కొంత మంది స్టార్స్ కి ఈ 2024 మంచే చేసి పెట్టింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్,,నాగార్జున..బాలయ్య ఇలా కొందరి 2024 తీ గుర్తులని ఇచ్చే వెళ్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: