ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై అల్లు అర్జున్ ని ఏకాకి చేసినట్టు ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం సినీ ఇండస్ట్రీ మొత్తం రేవంత్ రెడ్డితో భేటీ అయింది. అది కూడా రేవంత్ రెడ్డి దగ్గర టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తల దించినట్లు అయింది అని కొంతమంది ప్రత్యక్షంగానే మాట్లాడారు. తమ్మారెడ్డి భరద్వాజ కేవలం బన్నీ చేసిన తప్పు కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వెళ్లి సీఎం ముందు తల వంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఆయన చేసిన తప్పుకి అందరూ కాళ్ళ్లా వేళ్లా పడ్డారంటూ మాట్లాడారు. అయితే ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరు కూడా బన్నీని తప్పు అనలేదు కేవలం తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం అల్లు అర్జున్ పేరు తీసి మరీ విమర్శించారు.
అయితే ఇండస్ట్రీలో ఉన్న ఏ పెద్దవాళ్లు కూడా అల్లు అర్జున్ ని తప్పు పట్టలేదు.అయితే సురేష్ బాబు పరోక్షంగా బన్నీని అన్నప్పటికీ మళ్లీ క్లారిటీ ఇచ్చి నేనెందుకు వాడిని అంటాను. వాడు నా కొడుకు ఫ్రెండు.చిన్నప్పటి నుండి నేను వాడిని చూస్తున్నాను.వాడితో నాకేంటి వైరం. నేను వాడిని అనలేదు.. అంటూ బన్నీ గురించి క్లారిటీ ఇచ్చారు. అయితే తమ్మారెడ్డి ఒక్కరే బన్నీని విమర్శించడంతో ప్రస్తుతం ఈ ఈ విషయంపై చాలామంది నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.అసలు అల్లు అర్జున్ పై తమ్మారెడ్డి భరద్వాజకి ఉన్న పగ ఏంటి అని సెర్చ్ చేస్తున్నారు.అయితే గతంలో తమ్మారెడ్డి భరద్వాజ అల్లు అర్జున్ తో ఒక సినిమాని అనుకున్నార.
ఇక స్క్రిప్ట్ వర్క్ మొత్తం రెడీ అయ్యాక అల్లు అర్జున్ వేరే సినిమాలో బిజీ ఉండడం వల్ల తమ్మారెడ్డి భరద్వాజకి ఓకే చెప్పిన డేట్స్ క్యాన్సిల్ చేసి వేరే సినిమా షూటింగ్ కి వెళ్ళిపోయారట. ఇక మాట తప్పినందుకు తమ్మారెడ్డి భరద్వాజ అప్పటినుండి అల్లు అర్జున్ పై పగ పెంచుకున్నట్టు తెలుస్తోంది.ఇక దొరికిందే సందు అనుకొని ఆయన పుష్పటు విడుదలైన సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన గురించి అరెస్ట్ అవడం, రేవంత్ రెడ్డి దీని గురించి మాట్లాడడంతో తమ్మారెడ్డి భరద్వాజ బన్నీ పై ఉన్న విషం అంతా కక్కారంటూ వార్తలు వినిపిస్తున్నాయి