పూరికి ఊహించని హీరో నుంచి బిగ్ సర్ ప్రైజ్.. ఇక 2025 పండగే..!

Amruth kumar
డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తర్వాత సినిమా ఏ హీరోతో చేస్తాడు ? అన్నదానిపై రకరకాల పుకార్లు వైరల్ అవుతున్నాయి .. మెగాస్టార్ చిరంజీవి , సిద్దు జొన్నలగడ్డ , గోపీచంద్ ఇలా చాలామంది హీరోలతో పూరి టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది .. ఇక వచ్చే సంవత్సరం వాళ్లలో ఎవరో ఒకరితో సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు .. ఇక సిద్దు జొన్నలగడ్డ ఫామ్ లో ఉన్నాడు ఇప్పుడు పూరీతో సినిమా అంటే అతనికి రిస్క్ అనే వాదన తెరపైకి వచ్చింది ..

అలాగే ఫామ్ లో ఉన్న విజయ్ దేవరకొండ పూరితో ఇలాగే సినిమా చేసి రిస్కుల్లో పడ్డాడు .. అతనే పెద్ద ఎగ్జాంపుల్ గా తెరపైకి కనిపిస్తున్నాడు .. ఇవన్నీ ఆలోచిస్తే సిద్దూ  రిస్కు తీసుకునే ఛాన్స్ చాలా తక్కువ.. ఇక మెగాస్టార్ చిరంజీవి కోసం ఆటో జానీ కథ‌కు రిపేర్లు మొదలుపెట్టినట్టు కూడా ప్రచారం జరుగుతుంది .. ఇక ఇందులో వాస్తవం లేదని తేలిపోయింది. అలాగే యాక్షన్ హీరో గోపీచంద్ సినిమాను మాత్రం వచ్చి ఏడాది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా అంటున్నారు .. కానీ వీటిలో ఏది క్లారిటీ న్యూస్ కాదు .. పలానా స్టార్ డేట్లు ఇస్తాడని క్లారిటీ చెప్పలేని పరిస్థితి.
కానీ పక్కగా పూరికి డేట్లు ఇచ్చే ఓ అభిమాన హీరో మాత్రం ఉన్నారు. అతనే నట సింహం నందమూరి బాలకృష్ణ ..

ఈ ఇద్దరు మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే .. ఈ ఇద్దరి కాంబినేషన్లో పైసా వసూల్ సినిమా కూడా వచ్చింది .. ఇక అప్పటి నుంచి స్నేహితులయ్యారు పూరీని భయ్యా అంటే ఎంతో ఆప్యాయంగా బాలయ్య బాలయ్య పిలుస్తారు .. కల్మషం లేని మనసు మనిషి అంటూ పూరి వ్యక్తిత్వాన్ని కొనియాడుతారు .. బాలయ్య గురించి పూరి మనసులో మాట కూడా ఇదే. కోపం ఎక్కువైనా బాలయ్య మనసు మాత్రం వెన్న అని అంటాడు .. పైసా వసూల్ స‌మ‌యంలోనే ఇద్దరు కలిసి వెంటనే మరో సినిమా చేయాలని కూడా భావించారు .. కానీ అప్పుడు పూరికి ఇతర ప్రాజెక్టులు ఉండటంతో కుదరలేదు. ఈ క్రమంలోనే పూరి కష్టకాలంలో అవకాశం అడిగితే బాలయ్య నో  చెప్పకుండా చేద్దామని పాజిటివ్ మాట రావటం పక్క అని కూడా అంటున్నారు. ఈ విధంగా పూరికి బాలయ్య రూపంలో అవకాశం కచ్చితంగా రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: