బేబీ బంప్‌తో సమంత.. షాక్ లో అభిమానులు .. వైరల్ అవుతున్న ఫోటోలు ఇవే..!
నాగచైతన్యతో విడాకులు తర్వాత తనకు మాతృత్వాన్ని అనుభవించాలన్న కోరిక ఉందని అప్పట్లో సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది .. అలాగే అప్పట్లో ఆ ఇంటర్వ్యూలో చెప్పిన ఈ విషయం ఎంతో వైరల్ అయింది .. ఇక ఇప్పుడు సమంత బేబీ బంప్ ఫోటోలు చూసిన వారంతా ఈ విషయాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకుంటున్నారు .. అప్పుడు అలా అంది ఇప్పుడు నిజం చేసిందా అని కామెంట్స్ చేస్తున్నారు .. ఇక సమంత బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారాయి.
ఇక ఆసలు విషయం ఏమిటంటే సమంత నిజంగానే గర్భవతి కాదు .. ఇవి ఎవరో చేసిన దిక్కుమాలిన పని .. ఏఐని ఉపయోగించి సమంత బేబీ బంప్ ఫోటోలను క్రియేట్ చేశారు .. ఇదేం కొత్త కాదు .. గతంలో కూడా సమంత ప్రెగ్నెంట్ అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేశారు .. ఇప్పుడు ఏకంగా సమంత బేబీ బంప్ ఫోటోలను క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో వదిలారు .. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఒక్క సరిగా షాక్ అవుతున్నారు.