"తారక్"ను ఫాలో అవుతున్న బాలయ్య.. అదే జరిగితే ఫ్యాన్స్ డిసప్పాయింట్ కావాల్సిందే..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. బాబి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను ఈ చిత్ర బృందం వారు మొదలు పెట్టారు.

అందులో భాగంగా ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలను , కొన్ని ప్రచార చిత్రాలను కూడా మేకర్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమా నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ ఈ మధ్య కాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈయన డాకు మహారాజ్ సినిమా గురించి మాట్లాడుతూ ... ఈ సినిమాలో ఇంటర్వెల్ రావడానికి 20 నిమిషాల ముందు ఓ సన్నివేశం స్టార్ట్ అవుతుంది. ఆ సన్నివేశం అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. ఎవరైతే పేపర్లు విసరడం స్టార్ట్ చేస్తారో వారు 20 నిమిషాల పాటు పేపర్లు విసురుతూనే ఉంటారు. ఆ రేంజ్ లో ఆ సీన్ ఉంటుంది అని చెప్పాడు. దీనితో ప్రేక్షకులు ఆ సన్నివేశంపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం తారక్ "దేవర పార్ట్ 1" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా తారక్ "దేవర" సినిమాలో ఆఖరి 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుంది. దానితో సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పాడు. ఇక ఆఖరి 45 నిమిషాలు తారక్ చెప్పిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. ఇలా నాగ వంశీ "డాకు మహారాజ్" మూవీలో ఇంటర్వెల్ 20 నిమిషాల ముందు గొప్పగా ఉంటుంది అని చెప్పడంతో కచ్చితంగా అది గొప్ప సన్నివేశం అయి ఉంటే బాగుంటుంది అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: