పవన్ వల్ల ఫుల్ పబ్లిసిటీ అయిన సినిమాలు ఇవే.. రిజల్ట్ పరిస్థితి ఏంటి..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన నటించిన సినిమాలకు హిట్ , ఫ్లాప్ టాక్ తో సంబంధం లేకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అదే పవన్ నటించిన సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లయితే బాక్సా ఫీస్ షేక్ అయ్యే రేంజ్ లో కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అంత స్థాయి కలిగిన ఈ హీరో సినిమా టైటిల్స్ తో ఇప్పటికే అనేక సినిమాలో వచ్చాయి. మరికొన్ని రావడానికి రెడీగా ఉన్నాయి. మరి అలా పవన్ సినిమా ద్వారా మంచి పబ్లిసిటీని ఫుల్ గా చేసుకున్న సినిమాలేవో తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన సూపర్ హిట్ సినిమాలలో తొలిప్రేమ మూవీ ఒకటి. ఈ టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. విజయ్ దేవరకొండ "ఖుషి" అనే టైటిల్ తో ఓ సినిమాలో హీరోగా నటించాడు. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఖుషి మూవీ అద్భుతమైన విజయం సాధించగా , విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఖుషి సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక పవన్ నటించిన మంచి విజయవంతమైన సినిమాలలో తమ్ముడు మూవీ ఒకటి.

ప్రస్తుతం నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా రూపొందుతుంది. ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన సినిమా టైటిల్స్ తో మాత్రమే కాకుండా ఆయన హీరోగా రూపొందిన సినిమాల్లోని పాటల్లో నుండి కూడా పదాలను తీసుకొని సినిమాకు టైటిల్స్ గా పెట్టుకున్నారు. అందులో భాగంగా పిల్ల నువ్వు లేని జీవితం , కెవ్వు కేక అనే సినిమాలో కూడా వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా మంచి పబ్లిసిటీని ఈ సినిమాలు చేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: