సీఎంతో మీటింగ్...పిచ్చ క్లారిటీనున్న మెగాస్టార్...అందుకే అలా చేసారా.?

FARMANULLA SHAIK

సినీ ఇండస్ట్రీలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి సినీ పెద్దలంతా  సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ బాలకృష్ణ, చిరంజీవి ఈ మీటింగ్ కి దూరమైనట్టు సమాచారం. ఇందుకు గల పలు కారణాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ కారణాలు ఏమిటో ఒకసారి చూద్దాం.మరొకవైపు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలతో పాటు సినీ దర్శకుడు, నిర్మాతలు కూడా  సీఎం రేవంత్ రెడ్డి ని కలసిన సంగతి తెలిసిందే. కానీ బాలకృష్ణ, చిరంజీవి ఈ మీటింగ్ కి దూరంగా ఉన్నట్లు సమాచారం.
అసలు విషయంలోకి వెళితే సీఎం గా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలు అంటూ చాలామంది హీరోలకు సంబంధించిన నిర్మాణాలపై వేటు వేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగార్జున N-  కన్వెన్షన్ హాల్లోని కొంత భాగం కూల్చివేశారు. అలాగే బాలకృష్ణ ఇంటి చుట్టూ కూడా మార్క్ వేయడంతో.. అవమానంగా భావించిన బాలయ్య ఇప్పుడు ఈ మీటింగ్ కి రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బాలయ్య ఈ కారణంగానే ముఖ్యమంత్రిని కలవడం లేదని సమాచారం. అలాగే చిరంజీవి కూడా ఇప్పుడు ఈ మీటింగ్ కి హాజరు కావడం లేదని తెలుస్తోంది

ఎందుకంటే గతంలో కూడా సినిమా ఇండస్ట్రీలో సమస్యలు వచ్చినప్పుడు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి అక్కడ చేతులు కట్టుకొని నిలుచున్నారు మెగాస్టార్. ఆ సమయంలో అది అవమానంగా భావించిన అభిమానులు పెద్ద ఎత్తున.. ఆ వీడియో వైరల్ చేస్తూ.. కామెంట్ చేశారు.  అంతేకాదు చాలామంది విమర్శిస్తూ ట్రోల్స్ కూడా వేశాడు. దానితో అవమానంగా ఫీల్ అయిన చిరంజీవి ఇప్పుడు ఇలాంటివి జరగకుండా.. ఈ మీటింగ్ కి రాలేదని తెలుస్తోంది.దీనికి తోడు తన మేనల్లుడు అల్లు అర్జున్ విషయం ఒకటి చర్చనీయాంశంగా మారుతున్న  నేపథ్యంలో.. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని చిరంజీవి రేవంత్ రెడ్డిని కలవడానికి రాకపోయి ఉండొచ్చు అని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా సీఎం మీటింగ్ రోజు చిరంజీవి హైదరాబాద్ లోనే ఉన్నట్లు సమాచారం.అయినా కూడా చిరంజీవి సీఎం భేటీకి రాకుండా ఏపీ కి చెందిన మంత్రి టీజీ భరత్ కుమార్ కుమార్తె పెళ్ళికి వెళ్లినట్లు సమాచారం.మరి ఏది ఏమైనా ఇండస్ట్రీ దిగ్గజాలైన చిరంజీవి, బాలకృష్ణ.. ఇద్దరు కూడా మీటింగుకి వెళ్లకపోవడం పై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: