సోనియా, యష్ ని పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా?
అయితే సోనియా బిగ్ బాస్ సీజన్ 8 సీజన్ లో నిఖిల్, పృధ్విలతో బాగా క్లోజ్ అయ్యింది. ఆమె ఏం చెబితే అది చేసేలా వాళ్లిద్దరిని మార్చేసింది. వాళ్లిద్దరితో క్లోజ్ గా ఉంటూ లవ్ స్టోరీ నడిపిస్తుంది అనే సారికి.. సడెన్ గా పెద్దోడు చిన్నోడు అంటూ మాట మార్చేసింది. అంతేకాదు తర్వాత తాను యష్ అనే అతనితో లవ్ లో విషయం కూడా చెప్పింది. బయటకు వెళ్లాక పెళ్లి చేసుకుంటానని కూడా తెలిపింది. కానీ సోనియా నిఖిల్, పృధ్విని తనకి నచ్చినట్లు ఆడుస్తుందని టాక్ వచ్చింది. ఆ నెగిటివిటీ వల్లే సోనియా ఎలిమినేట్ అయ్యింది.
ఐతే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లి వచ్చాక యష్ తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. ఇటీవల వీరి వివాహం కూడా జరిగింది. అయితే సోనియా, యష్ ని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో తెలిపింది. తాను ప్రారంభించిన ఎన్జీవోకి వెడ్ డిజైనింగ్గా యష్ చేశాడని తెలిపింది. అలాగే స్పాన్సర్గానూ వ్యవహరించాడని.. దాంతో వారిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడిందని చెప్పింది. సోనియాకి కొన్ని ఆలోచనలు ఉన్నాయని.. యష్ పరిచయం తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయని సోనియా చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకంటూ ఓ డ్రీమ్ ఉండేదని తెలిపింది. డ్రీమ్ హౌజ్ కట్టుకోవాలి, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ఎమోషనల్గా బ్యాలెన్స్ రావాలని, ఆర్థికంగా బ్యాలెన్స్ రావాలి అని సోనియా అనుకునేదాట. వాటిలో యష్ పాత్ర ఎంతో ఉందని, అలాగే తనలో ఎంతో మార్పుకు కారణమయ్యాడని సోనియా చెప్పింది. అందుకే యష్ ని వివాహం చేసుకున్నాను అని తెలిపింది.