"తండేల్" పైనే ఆశలు.. కొత్త సంవత్సరంలో అయినా చైతూ కెరీర్ బెస్ట్ హిట్ అందుకుంటాడా...?

murali krishna
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య.. నటుడుగా తనని తాను నిరూపించుకుంటున్నాడు.. నాగార్జున తలుచుకుంటే నాగచైతన్య హీరోగా స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయించగలడు.. కానీ నాగచైతన్య నటుడుగా ఎదగాలన్నదే ఆయన ఆశ.. తండ్రి ఆశను నాగచైతన్య నెరవేరుస్తున్నారు. నాగ చైతన్య ఇప్పటి వరకు ఎన్నో హిట్ సినిమాలలో నటించాడు..కానీ నాగచైతన్య చివరిగా కనిపించిన ‘కస్టడీ’ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేదు..

ప్రస్తుతం నాగ చైతన్య  ఆశలన్నీ తర్వాతి సినిమా ‘తండేల్’ మీదే వున్నాయి…ఈ సినిమాలో నాగచైతన్య సరసన మరోసారి స్టార్ హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది..”కార్తీకేయ 2” సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ గతంలో '100 పర్సెంట్ లవ్' నిర్మించింది. ఇప్పుడు మళ్లీ ‘తండేల్’ మూవీని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే రీసెంట్ గా విడుదలైన వీడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన “ బుజ్జి తల్లి “ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది..

శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లగా పాకిస్థాన్‌ కోస్టుగార్డులు వాళ్ళని పట్టుకుంటారు...ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతుంది..ఇందులో నాగ చైతన్య గుజరాత్ సముద్రతీర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి పాత్రలో నటించారు.. ఈ సినిమాలో దర్శకుడు చందూ మొండేటి నాగచైతన్య, సాయి పల్లవి మధ్య సాగే లవ్ ట్రాక్ ని ఎంతో ఏమోషనల్ గా తెరకెక్కించారు.. చిత్ర యూనిట్ అంతా ఈ సినిమాపై ఎంతో ధీమాగా వుంది. మేకర్స్ ఈ సినిమాను 2025 ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: