సరిగ్గా మరో 11 రోజుల్లో జరిగేది అదే..రామ్ చరణ్ సంచలన నిర్ణయం..!?

Thota Jaya Madhuri
మనకు తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాల కోసం ఎంత కష్టపడతాడు అన్న విషయం. మరి ముఖ్యంగా రామ్ చరణ్ ఏ సినిమాలో నటించినా..ఏ సినిమాకి కమిట్ అయిన ప్రాణం పెట్టినటిస్తాడు.  అది పాన్ ఇండియా లెవెల్ సినిమా అయినా.. చిన్న స్థాయి సినిమా అయినా.  రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చే సినిమా అయినా.. ఇలాంటివి పెద్దగా ఆలోచించడు. ఏ సినిమానైనా సరే దానికి తగ్గ న్యాయం చేస్తూ ఉంటాడు.  రీసెంట్గా రాంచరణ్ నటించిన సినిమా "గేమ్ చేంజర్:.


కోలీవుడ్ స్టార్ హీరో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . కియరా అద్వానీ - అంజలి హీరోయిన్ లు గా నటించిన ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అన్న విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . అయితే రామ్ చరణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనడం లేదు .


ఈ సినిమాకి చాలా తక్కువగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. కధా.. కంటెంట్ ఉంటే సినిమాకి డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నారో.. లేకపోతే రీసెంట్గా సంధ్యా థియేటర్ ఇష్యూ జరిగిన కారణంగా సైలెంట్ అయిపోయారో తెలియదు కానీ "గేమ్ చేంజర్: విషయంలో కూసింత ప్రమోషన్స్ స్లోగానే నడుస్తున్నాయి . అయితే కరెక్ట్ గా రాంచరణ్ "గేమ్ చేంజర్" సినిమా రిలీజ్ కి ముందే సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . రామ్ చరణ్ తన పేరులో చిన్నచిన్న మార్పులు చేసుకున్నారట . న్యూమరాలజీ ప్రకారం రామ్ చరణ్ తన పేరులో రామ్ ని డబల్ ఏఏ(RAAM CHARAN) గా మార్చుకున్నారట. కొందరి పెద్ద మనుషుల సలహా మేరకు రామ్ చరణ్ ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . అయితే మెగా ఫాన్స్ మాత్రం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేస్తామంటూ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: