హరిహర వీరమల్లు: వీరమల్లు వీరత్వం 2025 వేసవిలో ఫ్యాన్స్ ను కూల్ చేస్తుందా.?

Pandrala Sravanthi
- హరిహర వీరమల్లులో సరికొత్త లుక్
- 2025 లో ఫ్యాన్స్ ను అలరించేనా.?


 పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల్లో ఎంతటి స్థాయికి ఎదిగారో రాజకీయాల్లో కూడా అంతకంటే డబ్ లు స్థాయికి ఎదిగారు. అసలు రాజకీయాలకు పనికిరాడు అన్న వ్యక్తులే ప్రస్తుతం ఆయన చుట్టూ తిరుగుతూ పవన్ లేకపోతే రాజకీయాలు ఉండేవి కావు అంటున్నారు. అలా పవన్ కళ్యాణ్ టైం చూసి దెబ్బ కొట్టారు. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టుగా, ఓకే గెలుపుతో డిప్యూటీ సీఎం కాగలిగారు జాతీయస్థాయిలో పార్టీ నిలబెట్టుకోగలిగారు, తాను అంటే ఏంటో నిరూపించుకోగలిగారు.  అలా పవన్ కళ్యాణ్ ఇంతటి స్థాయికి చేరి పవర్ ఫుల్ రాజకీయ నాయకుడిగా మారినా కానీ ఇంకా అభిమానులు ఆయనను సినిమాల వైపే ఎక్కువగా కోరుకుంటున్నారు.  

అయితే రాజకీయాల్లో ఆయన అడుగుపెట్టినప్పటి నుంచి ఓజీ, హరిహర వీరమల్లు  సినిమాలను లైన్ లో పెట్టుకున్నారు.  ఈ సినిమాలు అప్పుడు వస్తాయి, ఇప్పుడు వస్తాయి అంటూ దాదాపుగా రెండు నుంచి మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమాలు వచ్చింది లేదు మనం చూసింది లేదు. అలాంటి ఈ తరుణంలో 2024 లో తప్పక సినిమాలు వస్తాయని, హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వబోతుందంటూ ఎన్నో  వార్తలు వచ్చాయి. కానీ 2024 కూడా ఇట్టే ముగిసిపోయింది. ఇంకా కొన్ని గంటల్లో 2025 కూడా రాబోతోంది. 2025 వేసవిలో అయిన ఈ సినిమా వస్తుందా.? లేదంటే కొత్త ఏడాది కూడా అలాగే ఉరిస్తుందా.?  ఆ వివరాలు ఏంటో చూద్దాం.
 2025 వీరమల్లు వీరత్వం కనబడుతుందా?


 పీడియాటిక్ యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతున్న హరిహర వీరమల్లు సినిమాను జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంత భాగం తెరకేక్కించిన క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు కూడా తెలుస్తోంది. రెండు పార్ట్ లుగా ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది.అయితే మొదటి భాగం 2025 మార్చిలో రిలీజ్ అవబోతున్నట్టు  ఇప్పటికే చిత్ర యూనిట్ వారు అధికారికంగా ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అలా పోస్టర్ రిలీజ్ అయిందో లేదో కొన్ని గంటల్లోనే కోట్లాది వ్యూస్ సంపాదించుకుంది. దీన్ని బట్టి చూస్తే సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చిత్రాన్ని 15వ శతాబ్దంలోని మొగల్ సామ్రాజ్యపు కాలంనాటి పరిస్థితి ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. సరికొత్త కథాంశంతో మన ముందుకు వస్తుండడంతో ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన హైప్ పెరిగింది.. అలాంటి ఈ సినిమా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం 2025లో అయిన మన ముందుకు వచ్చి అభిమానులను ఆనందపరుస్తుందా? లేదంటే ఇంకా వెయిట్ చేయండి అంటూ అలాగే ఊరిస్తుందా? అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: