ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటికే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో శ్రీ లీల "కిసిక్" అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ , శ్రీ లీలా స్టెప్స్ ప్రధాన ఆకర్షణగా మారాయి.
ఇకపోతే పైన ఫోటోలో అల్లు అర్జున్ తో పాటు ఒక అమ్మాయి ఉంది ఆమె ఎవరో తెలుసా ..? ఆ బ్యూటీ కిసిక్ పాటకు గణేష్ ఆచార్య మాస్టర్ తో పాటు పని చేసింది. ఇకపోతే ఈ బ్యూటీ అసలు పేరు ఊర్వసి అప్సర. ఇక పాటకు అల్లు అర్జున్ తో పాటు ఈ బ్యూటీ చేసిన డ్యాన్స్ స్టెప్ లు కూడా వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కేవలం పుష్ప పార్ట్ 2 లోని స్పెషల్ సాంగ్ కి మాత్రమే కాకుండా పుష్ప పార్ట్ 1 లో సమంత చేసిన ఊ అంటావా అంటూ సాగే స్పెషల్ సాంగ్ కి కూడా డాన్స్ కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది.
పుష్ప పార్ట్ 2 లోని కిసిక్ పాటకు అల్లు అర్జున్ తో పాటు డాన్స్ వేస్తూ కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ముద్దు గుమ్మ కు కూడా అద్భుతమైన క్రేజ్ ఈ వీడియోతో లభించింది. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. దానితో సోషల్ మీడియాలో కూడా ఈమెకు ఫుల్ క్రేజ్ ఉంది.