2025 అవైటెడ్ డాకూ మహారాజ్... బాలయ్య ఖాతాలో 4 విజయం రాసుకోండి.. !
టాలీవుడ్ లో 2024 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోతుంది. 2025లో పలు క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ కానున్నాయి. ముందుగా సంక్రాంతి నుంచి వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులు థియేటర్లలోకి దిగుతాయి. సంక్రాంతికి మూడు మంచి అంచనాలు ఉన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ .. బాలయ్య - బాబి కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ .. వెంకీ - అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాలయ్య సినిమా విషయానికి వస్తే ఇప్పటికే బాలయ్య మూడు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాల తో కెరీర్ లో తిరుగులేని ఫామ్ లో ఉన్నారు. ఇక డాకు మహారాజ్ విషయానికొస్తే ఈ సినిమా దర్శకుడు బాబి చివరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య .. ఇటు బాలయ్య వరుస హిట్లర్ తో ఉండటం అటు బాబీ కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో ఫామ్ లోకి రావడంతో డాకు మహారాజ్ పై అంచనాలు మామూలుగా లేవు.
పైగా ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టైటిల్ ... టీజర్ తో పాటు ప్రమోషనల్ కంటెంట్ అంతా సినిమాపై హైప్ పెంచేస్తోంది. బాలయ్య బాబు సినిమాకు పెద్దగా కథ అవసరం లేదు అనే భావన ఉంది .. నిర్మాత నాగ వంశీ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. డాకు మహారాజ్ కదా ఇంకా జనాలకు అందలేదు .. ఎక్కువ కంటెంట్ బైటికి రాలేదు. అయితే సమరసింహారెడ్డి తదితర బాలయ్య సినిమాలో ఛాయలు ఉంటాయని టాక్ ఉంది. పైగా ఇప్పటివరకు రెండు గెటప్పులు బయటికి వచ్చాయి .. ఇక్కడ కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉంటుందని తెలుస్తోంది.
ఇంటర్వెల్ 20 నిమిషాలు ఊచకోత ఉంటుందట. ఇంటర్వెల్ తర్వాత కూడా కొంత ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఉంటుందని సమాచారం. ఎమోషన్లు ... యాక్షన్ సీన్లు సినిమాలు అదిరిపోతాయని అంటున్నారు. ఇక తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలు అదిరిపోతాయని తెలుస్తుంది. ఊర్వసి రౌతేలా తో ఐటమ్ సాంగ్ అదరగొట్టేసారట. బాలయ్య మార్క్ డైలాగులు .. యాక్షన్ సీన్లు అదిరిపోతాయని డాకు మహారాజ్ మరోసారి సంక్రాంతికి బాలయ్య పర్ఫెక్ట్ సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుందని అంచనాలు ఉన్నాయి.