అల్లు అర్జున్ బెయిల్‌ పిటిషన్ పై సస్పెన్స్.. విచారణ వాయిదా..?

Amruth kumar
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది .. నాంపల్లి కోర్టు జనవరి 3 వరకు వాయిదా వేసింది .. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే .. అలాగే అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు .. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్  పై ఉన్న విషయం తెలిసిందే .. పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది .. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం తో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పై సీరియస్ అయ్యారు .

 
అలాగే పోలీసులు కూడా థియేటర్ యాజమాన్యం పై అలాగే అల్లు అర్జున్‌ పై కేసు పెట్టారు .. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు డిసెంబర్ 13 న 14 రోజుల పాటు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు .. ఇక దాని పై అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్లు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు  క్వాష్‌ పిటిషన్ దాఖలు చేశారు .. వాదనలు తర్వాత హైకోర్టు అల్లు అర్జున్ కు మభ్యంతర బెయిల్‌ ఇచ్చింది.

 
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే బెయిల్ వచ్చిన తర్వాత రోజు ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అర్జున్ విడుదలయ్యారు .. నాంపల్లి కోర్టు విధించిన 14 రోజులు రిమాండ్ ఇటీవలే పూర్తయింది .. ఇదే క్రమంలో కోర్టుకు హాజరై .. హైకోర్టు బెయిల్ ఇచ్చిన‌ విషయం అల్లు అర్జున్ కోర్టు కు తెలిపారు .. మరోవైపు అల్లు అర్జున్ అడ్వకేట్ లు నాంపల్లి కోర్టులో సైతం రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు .. దాని పై నాంపల్లి కోర్టు విచారణ జరిపి .. తాజాగా జనవరి 3 కు వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: