రేవంత్ రెడ్డికి రామ్ చరణ్ అలా బిస్కెట్ వేస్తున్నాడా..? మెగా తెలివితేటలు..!

Thota Jaya Madhuri
"రేవంత్ రెడ్డి".. పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో అదే విధంగా సినీ రంగంలో ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి - అల్లు అర్జున్ విషయంలో తీసుకున్న స్ట్రాంగ్ డెసిషన్ అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది . సాధారణంగా ఏ పొలిటిషియన్ అయినా ఏ స్టార్ సెలబ్రిటీ విషయంలో కూసింత వెనక్కి తగ్గుతూ ఉంటారు . ఫాన్స్ ట్రోలింగ్ భయం కారణంగా కావచ్చు ..? లేకపోతే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కారణంగా కావచ్చు..? రీజన్ ఏదైనా సరే కొంతమంది పొలిటీషియన్స్ స్టార్స్ విషయంలో వెనక స్టెప్ వేస్తూ ఉంటారు . అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయంలో తగ్గేదేలే అన్న రేంజ్ లో ముందుకు వెళ్ళిపోతున్నాడు .


రేవంత్ రెడ్డి ..అల్లు అర్జున్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా డెసిషన్స్ తీసుకున్నాడో అందరికీ తెలిసిందే . కాగా అల్లు అర్జున్ ఇష్యూ పక్కన పెడితే ఇప్పుడు మళ్లీ ట్రాక్లోకి రామ్ చరణ్ వచ్చాడు.  రామ్ చరణ్ "గేమ్ చేంజర్" సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది . జనవరి 10వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా . అయితే తెలంగాణలో మాత్రం టికెట్ రేట్లు పెంచము.. బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వము అంటూ తేల్చి చెప్పేసాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.


అయితే కొంతమంది మాత్రం రేవంత్ రెడ్డి పిక్స్ ను అదే విధంగా గేమ్ చేంజర్ లో చరణ్ పిక్స్ ను మ్యాచ్ చేస్తూ 'రీల్ లో రామ్ చరణ్.. రియాలిటీలో రేవంత్ రెడ్డి'.. ఇద్దరు సేమ్ టు సేమ్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . అయితే నిన్న మొన్నటి వరకు మెగా ఫాన్స్ ఎవ్వరు రేవంత్ రెడ్డి పేరు ఎత్తనే ఎత్తలేదు. సడన్గా గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అవుతుంది అన్న మూమెంట్లో రేవంత్ రెడ్డి పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు .ఇది మెగా ఫాన్స్ ..రేవంత్ రెడ్డికి వేసే బిస్కెట్ అంటున్నారు జనాలు . అంతేకాదు మెగా తెలివితేటలు ఎక్కువగానే ఉన్నాయి మెగా ఫ్యాన్స్ కి అంటూ కూసింత ఘాటుగానే పక్క హీరోల ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఇన్నాళ్లు అల్లు ఫ్యామిలిని ఆడేసుకున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా ఆడేసుకుంటున్నారు అన్న విషయం క్లియర్ గా అర్థమైపోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: