మహేష్‌ బాబు దెబ్బ...సినిమాలు ఆపేస్తనంటున్న దర్శకుడు?

Veldandi Saikiran
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి థియేటర్లలో భారీగా వసూళ్లను రాబడుతోంది. సిని చరిత్రలోనే సంచలన విజయం నమోదు చేసుకున్న పుష్ప-2 సినిమా మంచి సక్సెస్ అందుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. 2021లో రిలీజ్ అయిన పుష్ప సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్గా నటించింది.

పుష్ప సినిమా మంచి విజయం సాధించడంతో పుష్ప-2 సినిమాపై ఎప్పటినుంచో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వారి అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సుకుమార్ ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన అనంతరం మంచి రికార్డులను సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు ఫాహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రలో నటించారు.

పుష్ప-2 సినిమా రిలీజ్ అయ్యి నాలుగో వారం అవుతున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వేగం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 సినిమా రూ. 1700 కోట్ల మార్క్ ను క్రాస్ చేసి సంచలనాలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే సుకుమార్ "గేమ్ చేంజర్" సినిమా గ్లోబల్ ఈవెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అందులో భాగంగా మాట్లాడుతూ.... మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమా ఫలితంతో సినిమాలు చేయడం ఆపేద్దాం అనుకున్నానని సుకుమార్ అన్నారు. యుఎస్ఎ లో ఆ సినిమాకు కలెక్షన్లు రాకపోయి ఉంటే సినిమాలు మానేసేవాడినంటూ హాట్ కామెంట్స్ చేశారు. యూఎస్ ఆడియన్స్ వల్లే ఇప్పుడు నేను ఇలా ఉన్నానని వారికి చాలా థాంక్స్ అంటూ సుకుమార్ చెప్పాడు. ఆ సినిమా తర్వాత సుకుమార్ తీసిన రంగస్థలం, పుష్ప, పుష్ప-2 సినిమాలు ఆయనకు మంచి విజయాలను అందించాయి.  దీంతో సుకుమార్ కు సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: