బాలకృష్ణ 100వ సినిమా ఆ డైరెక్టర్ తో చేయాలనుకున్నాడా.. కానీ మధ్యలోకి గౌతమీపుత్ర ఎలా వచ్చిందంటే..?
అనుకోని కారణాలతో బాలయ్య 100వ సినిమా అనిల్ రావిపూడి తో చేయలేకపోయారు .. కానీ తర్వాత బాలకృష్ణ 100వ సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా వచ్చింది. అయితే బాలకృష్ణతో సినిమా చేయాలనే తనకల అలాగే ఉండిపోవడం తో ఎలాగైనా సరే బాలయ్యతో సినిమా చేయాలనుకున్న అనిల్ రావిపూడి భగవంత్ కేసరితో ఆ కోరిక తీర్చుకున్నారు. అయితే బాలయ్య 100వ సినిమాగా తెరకెక్కించాలనుకున్న సినిమాలో బాలయ్యను పోలీస్ ఆఫీసర్ గా చూపించాలి అనుకున్నారట అనిల్ రావిపూడి .. అయితే అది అప్పుడు కుదరక ఆ క్యారెక్టర్ నిభగవంత్ కేసరిలో పడితే ఎలా ఉంటుంది అని ఆలోచించి వెంటనే ఆ పాత్రని ఈ సినిమాలో పెట్టినట్టు తెలుస్తుంది.
అదేవిధంగా ఎప్పటికైనా బాలకృష్ణతో రామారావు అనే టైటిల్ తో సినిమా చేయాలని అనిల్ భావిస్తున్నట్టు తెలుస్తుంది .. ఇదే క్రమంలో బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ కాబట్టి సెంటిమెంట్‌గా కూడా ఉంటుంది .. కానీ ఆల్రెడీ ఇదే టైటిల్ తో రవితేజ ఓ సినిమా చేశారు .. మరి ఈ సినిమా ఎప్పటికీ పట్టాలెత్తుందో చూడాలి. ప్రజెంట్ బాలకృష్ణ బాబి దర్శకత్వంలో నటించిన డాకు మహారాజ్ సినిమా వచ్చే సంక్రాంతికి రాబోతుంది .. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు యమ జోరుగా జరుగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూపర్ ఫామ్ లో ఉన్న బాలకృష్ణ ఈ డాకు మహారాజ్ తో సంక్రాంతికి ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తారో చూడాలి.