ఆ ఇద్దరు బ్యూటీలు "తారక్"కి ఎంతో స్పెషల్.. ఎందుకో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తారక్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో హీరో గా నటించగా చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఇకపోతే తారక్ తన కెరియర్ లో ఎంతో మంది ముద్దుగుమ్మలతో నటించిన ఓ ఇద్దరూ హీరోయిన్లు మాత్రం ఆయన కెరియర్ లో చాలా స్పెషల్ గా నిలిచారు. ఏకంగా తారక్ ఆ ఇద్దరు హీరోయిన్లతో నాలుగు , నాలుగు సినిమాల్లో నటించాడు. మరి ఆ హీరోలు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

తారక్ కెరీర్ లో చాలా స్పెషల్ గా నిలిచిన ఇద్దరు ముద్దుగుమ్మలు మరెవరో కాదు ... కాజల్ అగర్వాల్ , సమంత. కొన్ని సంవత్సరాల క్రితం తారక్ "బృందావనం" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ , అగర్వాల్ సమంత తారక్ కి జోడిగా నటించారు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మాత్రమే కాకుండా కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా ... కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ "బాద్ షా" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన టెంపర్ మూవీ లో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన రామయ్య వస్తావయ్య , రభస సినిమాల్లో సమంత హీరోయిన్గా నటించింది. ఇలా వీరిద్దరూ కూడా తారక్ హీరోగా రూపొందిన నాలుగు , నాలుగు సినిమాల్లో హీరోయిన్లుగా నటించి తారక్ కెరియర్ లోనే స్పెషల్ హీరోయిన్స్ గా మిగిలిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: