సుకుమార్ , పవన్ కళ్యాణ్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ స్టోరీ ఇదే..!

Amruth kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఎన్నో అవమానాలు తట్టుకొని విమర్శలు ఎదుర్కొని నిలిచి పార్టీకి 100% విజయాన్ని కట్టపెట్టాడు. అలాగే తాను కూడా పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో విజ‌యం అందుకున్ని డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇప్పటికే తన పనితీరుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సినిమాలు చేయటం అనేది ఎంతో కష్టంగా మారింది. గతంలో షూటింగ్ జరుపుకున్న సినిమాలకే డేట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. హరిహర వీరమల్లు , ఓజి , హరిశంకర్ సినిమాలు ప్రెసెంట్ ఉన్నాయి .. వచ్చే ఏడాది మాత్రం హరిహర వీరమల్లు , ఓజి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ వరుస‌గా సినిమాలు చేస్తున్న స‌మ‌యంలో దర్శకుడు సుకుమార్ పవన్ కోసం ఒక కథ రాసుకున్నారు .. ఇక దీనిపై పవన్‌తో చర్చలు కూడా జరిగాయి .. ఇక సుకుమార్‌తో సినిమా అంటే భారీగా కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది సంవత్సరాలు తరబడి సినిమా చేయాల్సి ఉంటుంది .. ఒకవైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ కు ఈ డేట్ లు సర్దుబాటు చేయడం కుదరదు .. ఇక దర్శకుడు సుకుమార్ కూడా ఎంతో ప్రయత్నించారు  .. అయితే ఈ కథ వేరే హీరోతో చేయడానికి ఆయన ఇష్టపడలేదు .. ఎందుకంటే ఆ క‌థ‌ పవన్ కళ్యాణ్ కు మాత్రమే సరిపోతుంది .. మరి ఏ హీరోకు సూట్ అవ్వదు . ఇక దాంతో ఆ కథను సుకుమార్ పక్కన పడేసారు ఆ విధంగా వీరిద్దరి కాంబోలో రావాల్సిన బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అయింది.

ప్రజెంట్ కూడా పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తే అదే కథతో సినిమా చేయాలని ఉద్దేశం ఉందట .. అయితే ఆయన ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేయడానికే వీలుకావడంలేదు .. ఇక దాంతో దర్శకుడు క్రిష్‌ హరిహర వీరమాల్లు నుంచి తప్పుకున్నారు మిగిలిన సన్నివేశాలను ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు .. వచ్చే మార్చిలో లేదా మేలో కానీ ఇది రిలీజ్ కానుంది.. ఇక ఓజిని సెప్టెంబర్ లో లేదా దసరాకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక మిస్టర్ బచ్చన్ మూవీ ప్లాప్‌తో హరీష్ శంకర్ సినిమా చేయడం కష్టమే అని అంటున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి తప్పుకొని అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: