అబ్బాయి కోసం బాబాయ్ ప్లానింగ్.. గేమ్ ఛేంజర్ లెక్క మారబోతుందా..?

Amruth kumar
మరికొన్ని గంటల2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం .. అలాగే సంక్రాంతి కూడా దగ్గరపడటం తో సంక్రాంతికి వచ్చే సినిమాలు ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా గడుపుతున్నాయి .. ఇదే క్రమంలో ఈ సంక్రాంతికి పాన్ ఇండియా మూవీ గా వస్తున్న గేమ్ ఛేంజర్ కూడా ప్రమోషన్స్ పీక్ స్టేజ్ కు చేరుకుంది . ఓవైపు పాటలు రిలీజ్ అవుతున్నాయి .. ట్రెండ్ అవుతున్నాయి .. మరోవైపు గ్రౌండ్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి .. ఇంకో వైపు యూనిట్ సభ్యులు వరుస ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి .. మరి ప్రధానంగా సోషల్ మీడియా లో హంగామా ఓ రేంజ్ లో నడుస్తుంది ..

ఇలా అన్ని వైపుల నుంచి ఇస్తున్న ప్రమోషన్లు పగడ్బందీగా నిర్వహిస్తున్నారు నిర్మాత దిల్ రాజు . అయితే ఇంత ప్రచారం చేస్తున్నప్పటికీ ఒక చిన్న క్లారిటీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు .. అదే పవన్ కళ్యాణ్ ఎంట్రీ. . గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కి పవన్ వస్తారని ప్రచారం చాలా రోజులుగా నడుస్తుంది . డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన సినిమా కార్యక్రమాల కు ఎంతో దూరంగా ఉంటున్నారు . ఇలాంటి టైం లో గేమ్ చేంజర్‌ ప్రమోషన్స్ కి పవన్ వస్తారా రారా అనేది అందరిలో ఉన్న అనుమానం .. ఇక పవన్ వస్తే ఈ సినిమాకు వచ్చే బజ్‌ మరో లెవల్లో ఉంటుంది .

ఇప్పుడు ఎట్టకేలకు దీనిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు . తాము కూడా వెయిట్ చేస్తున్నట్లు ప్రకటించారు . పవన్ కళ్యాణ్ సమయం ఇస్తే జనవరి 4 లేదా 5 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్లో పెద్ద ఈవెంట్ నిర్వహిస్తామని అంటున్నారు . రీసెంట్ గానే దిల్ రాజు , పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయిన విషయం తెలిసింది .. అలాగే అల్లు అర్జున్ ఇష్యూ పై కూడా పవన్ చేసిన‌ కామెంట్స్ కూడా హాట్‌ టాపిక్ గా మారాయి. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజ‌ర్‌ ఈవెంట్ కి వస్తే మాత్రం రామ్ చరణ్ కు మరింత బూస్ట్ ఇస్తుంది. మరి పవన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: