ఇండస్ట్రీలో అల్లు అర్జున్ తర్వాత స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్.. తగిలించుకోగలిగే సత్తా ఉన్న తెలుగు హీరో ఇతడే..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి హీరోకి ఒక్కొక్క ట్యాగ్ ఉంటుంది. చిరంజీవికి మెగాస్టార్ అని .. పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అని.. బాలయ్యకు నందమూరి నరసిం హం అని.. జూనియర్ ఎన్టీఆర్ కి యంగ్ టైగర్ అని ..ఒకటా రెండా..? చెప్పుకుంటూ పోతూ ఉంటే అందరూ హీరోస్ కూడా ఈ లిస్టులోకి వస్తారు . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అనగానే ముందు అందరికీ తట్టే పేరు అల్లు అర్జున్ ..బన్నీ . ఎస్ బన్నీనే  టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా చాలా స్టైలిష్ గా ఉంటాడు.  కొత్త కొత్త ట్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు.


అయితే ఇప్పుడు ఆయన పేరు అంతగా పాజిటివ్ కామెంట్స్ దక్కించుకోలేకపోతోంది . దానికి కారణం కూడా మనకు తెలుసు. ఊహించుని చిక్కుల్లో ఇరుక్కున్న అల్లు అర్జున్ తన పేరుని పాతాళానికి పడిపోయే స్థాయిలో డౌన్ ఫాల్ చేసుకున్నాడు అంటూ మండిపడుతున్నారు జనాలు . అల్లు అర్జున్ కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది అంటూ మండిపడుతున్నారు.  అయితే అల్లు అర్జున్ తర్వాత ఇండస్ట్రీలో అలా స్టైలిష్ స్టార్ గా ట్Yఆగ్ దక్కించుకోవాల్సి వస్తే ఏ హీరోకి ఆ కెపాసిటీ ఉంది..? అన్న కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి .


చాలామంది ఇండస్ట్రీలో చాలా చాలా పేర్లను సజెస్ట్ చేస్తున్నారు . కానీ ఎక్కువ మంది మాత్రం ఒకవేళ స్టైలిష్ స్టార్ ట్యాగ్ వేరే హీరోకి ఇవ్వాలి అంటే మాత్రం కచ్చితంగా అది రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి ఇస్తేనే బాగుంటుంది అని ..అల్లు అర్జున్ తర్వాత అంత స్టైలిష్ గా ట్రెండీగా.. ఇండస్ట్రీలో కొత్త కొత్త ట్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నది మాత్రం విజయ్ దేవరకొండ నే అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అన్నీ కలిసి వస్తే ఫ్యూచర్లో విజయ్ దేవరకొండ నే స్టైలిష్ స్టార్ అవుతాడు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అయిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: