బన్నీ అరెస్టుపై జానీ మాస్టర్ కామెంట్స్..ఏమన్నారంటే..?

Divya
సినీ ఇండస్ట్రీలో సంధ్యా థియేటర్ ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. డిసెంబర్ 4వ తేదీన అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో వేశారు. అక్కడికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా సినిమా చూడడానికి రావడంతో అభిమానులు ఆయనను చూడడానికి పెద్ద ఎత్తున ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా.. ఆమె కొడుకు శ్రీ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.
ఇకపోతే అల్లు అర్జున్ అరెస్టుపై చాలామంది సెలబ్రిటీలు రకరకాల కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జానీ మాస్టర్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత నేను మీమ్స్, సోషల్ మీడియా చూశాను. అయితే ఆయన అరెస్టు తర్వాత నేను హ్యాపీగా ఉన్నట్టు కొన్ని మీమ్స్ వేశారు.  బన్నీ అరెస్టు తర్వాత నాకు ముందు వాళ్ళ పిల్లలే గుర్తొచ్చారు.  సెట్స్ కి వస్తారు. వాళ్ళు బాగా ఆడుకుంటారు. నా కళ్ళ ముందే నేను చేశాను. మొదటి నాకు వాళ్లే గుర్తొచ్చారు. ఆరోజు జరిగింది. ఒక దురదృష్ట ఘటన. నేను కూడా హాస్పిటల్ కి వెళ్లి ఆ కుటుంబాన్ని కలిసి వచ్చాను అంటూ జానీ మాస్టర్ తెలిపారు.
ఇకపోతే సంధ్యా థియేటర్ ఘటనలో ఎఫెక్ట్ అయిన ఆ కుటుంబాన్ని,  ఆ బాలుడిని జానీ మాస్టర్ పరామర్శించి ఆర్థిక సహాయం కూడా చేస్తానని ప్రకటించారు. లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్ళిన జానీ మాస్టర్ ఇప్పుడిప్పుడే బయటకి వస్తూ మళ్లీ తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే డాన్స్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు జానీ మాస్టర్. అందులో భాగంగానే ఒక బాలీవుడ్ సినిమాకి కూడా అవకాశం అందుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: