బెల్లంకొండ: ఛత్రపతి రీమేక్ తో ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది ?
వాటిలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక సినిమా ఒకటి. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అనంతరం అల్లుడు అదుర్స్ అనే సినిమా చేశారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు వెళ్లారు. తెలుగు బ్లాక్ బస్టర్ సినిమా చత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశారు.
ఈ సినిమాకు దర్శకత్వం వహించింది తెలుగు దర్శకుడు వివి వినాయక్ కావడం గమనార్హం. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పటికే రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన చత్రపతి సినిమా యూట్యూబ్ లో హిందీ లో డబ్ అయింది. అందరూ ఆ సినిమాను అప్పటికే చూసారు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమా మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
దాంతో హిందీ సినిమా చత్రపతి డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీలో కూడా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 12 మే, 2023లో థియేటర్ లో రిలీజ్ అయిన ఈ హిందీ చత్రపతి సినిమాపై తాజాగా బెల్లంకొండ సురేష్ సంచలన కామెంట్స్ చేశాడు. చత్రపతి హిందీ రీమేక్ 45-50 కోట్లు పెట్టి తీస్తే తియేట్రికల్ నుంచి 2.5-3 కోట్లు వచ్చాయని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నాడు. ఇతను చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.