నటి ఐశ్వర్య రాజేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తమిళ సినిమాలలో నటిస్తున్నప్పటికీ తెలుగు సినిమాలలోను రాణిస్తోంది. తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఐశ్వర్య రాజేష్ తెలుగు నటి అయినప్పటికీ తమిళనాడులో స్థిరపడింది. కెరీర్ లో ఎక్కువగా కోలీవుడ్ సినిమాలలో నటించింది. అక్కడ ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ఈ బ్యూటీ విక్టరీ వెంకటేష్ తో కలిసి "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలో నటించింది.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇందులో ఐశ్వర్య రాజేష్ హీరో వెంకటేష్ కి భార్య పాత్రను పోషించింది. కాగా, ఈ సినిమా నేపథ్యంలో తన పెళ్లి పైన ఐశ్వర్య రాజేష్ సంచలన కామెంట్లు చేసింది. అందరూ హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కానీ ఐశ్వర్య రాజేష్ మాత్రం పెళ్లి చేసుకుంటే సినిమా అవకాశాలు రావు అనే వాధనను తెరపైకి తీసుకువచ్చింది. తాజాగా ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి చేసుకోవచ్చు కదా అని యాంకర్ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ పెళ్లి చేసుకోకపోతే నాలుగు సినిమా అవకాశాలు వస్తాయి అని ఐశ్వర్య చెప్పింది. దీనికి యాంకర్ నాలుగు కాదు 40 సినిమాలు చేయు పెళ్లి చేసుకుని సినిమాలు చేయి అని యాంకర్ చెప్పింది. వివాహం చేసుకున్నాక సినిమాలు మానేయి నేను సంపాదించి పెడతాను అని భర్త అంటే ఏమి చేయాలి అని ఐశ్వర్య అడిగింది.
దానికి సమాధానంగా యాంకర్ నువ్వు ఇల్లు చూసుకో నేను సంపాదిస్తానని చెప్పు అని సమాధానం ఇచ్చింది. అయితే అలాంటి అబ్బాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్య పాజిటివ్ గా స్పందించింది. తెలుగు అబ్బాయి అయినా పరవాలేదు... తమిళ అబ్బాయి అయినా పర్వాలేదు.... కానీ మంచి అబ్బాయి అయితే చాలు అని ఐశ్వర్య రాజేష్ సంచలన కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.