సినిమా ఇండస్ట్రీ లో ఓ సినిమా విడుదలకు ముందు ఆ మూవీ లో ఉన్న సాంగ్స్ ను ఒక్కో దాన్ని విడుదల చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళేందుకు ప్రమోషన్లు చేస్తూ ఉంటారు. అలా ప్రమోషన్లు చేసే ప్రాసెస్లో కొన్ని పాటలు విడుదల అయిన సందర్భంలో జనాలు ఇదెక్కడి పాట , ఇలాంటి పాట ఎందుకు సినిమాలో పెట్టారు అంటూ కొంతమంది కొన్ని పాటలపై కామెంట్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా నెగిటివ్ కామెంట్స్ మాత్రమే కాకుండా , కొన్ని పాటలపై ట్రోలింగ్ జరిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
అలా ట్రోలింగ్ కి గురైన ఎన్నో సాంగ్స్ అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాలో నుండి కుర్చీ మడత పెట్టి అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట విడుదల అయిన కొత్తలో దీనిపై అనేక నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి , విపరీతమైన ట్రోల్స్ జరిగాయి. కానీ ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ కూడా ఈ సాంగ్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఒక్క సాంగ్ అనే కాదు ... ఇలా విడుదల అయిన తర్వాత ట్రోలింగ్ కి గురైన ఎన్నో పాటలు మంచి సక్సెస్ ను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా బాలకృష్ణ "డాకు మహారాజ్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే "దబిడి దిబిడే" అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ లో బాలకృష్ణ ఊర్వసి రౌటేలా ఇద్దరు అదిరిపోయే స్టెప్ లు వేశారు ఇక ఈ స్టెప్పులు ఏంటి , ఇలాంటి స్టెప్పులు కంపోజ్ చేస్తారా ..? అంటూ ఈ సాంగ్ పై అనేక ట్రోలింగ్ జరిగింది. కానీ ఈ సాంగ్ కి మాత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఈ సాంగ్ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకోబోతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.