హానీరోజ్ ఫిర్యాదులో భారీ ట్విస్ట్.. ఏకంగా 27 మందిపై కేస్..!

Divya
టాలీవుడ్ ,కోలీవుడ్  హాట్ బ్యూటీగా పేరు సంపాదించింది హనీరోజ్.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాలతోనే అందరిని మైమరిపిస్తూ ఉంటుంది. బాలయ్యతో కలిసి వీరసింహారెడ్డి చిత్రంలో నటించిన ఈ సినిమాలో ఈమె రెండు విభిన్నమైన పాత్రలలో నటించింది. కానీ ఈ సినిమా తర్వాత హనీరోజ్ స్టార్ హీరోయిన్లకు మించి క్రేజీ సంపాదించుకుంది. తన నటనతో ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

ఇదంతా ఇలా ఉంటే గత రెండు రోజుల నుంచి తనను ఒక బిజినెస్ మాన్ వేధిస్తున్నారంటూ అసభ్యకరంగా మెసేజ్లు పెడుతున్నారంటూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడం జరిగింది హనీరోజ్. దీంతో హానిరోజు ఫిర్యాదు చేయడంతో ఏకంగా 27 మంది పైన కేసు నమోదు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఫేస్బుక్లో అసభ్యకరమైన కామెంట్స్ చేశారని ఫిర్యాదులు తెలపగా ఆ తర్వాత సోషల్ మీడియాలో ఒక వ్యక్తి తనని అవమానిస్తున్నారంటూ ఒక పోస్టుని వెల్లడించింది. అలా తన పైన బ్యాడ్ కామెంట్స్ రాయడంతో ఈమె పోలీసులను కూడా ఆశ్రయించిందట.

హనీరోజ్ కొన్ని స్క్రీన్ షాట్లతో పాటుగా కొచ్చి సిటీ పోలీసులకు సైతం  ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం. అలాగే తన లుక్స్ మీద వేసే సరదా జోక్స్.. మిమ్స్ తాను కూడా ఎంజాయ్ చేస్తానని కానీ వాటికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది అసభ్యకరమైన కామెంట్స్ చేస్తే అసలు సహించని అంటూ తాను ఇలాంటి విషయం పైన న్యాయపోరాటం చేస్తానంటూ తెలియజేసింది. ఇది తన కోసం మాత్రమే కాదు అని మహిళలందరి కోసం ఈ పోరాటం ఉన్నట్లుగా తెలియజేసింది. ఒక వ్యక్తి తనని కావాలని ఉద్దేశపూర్వకంగానే డబల్ మీనింగ్ కామెంట్స్ చేస్తూ అవమానిస్తున్నారని వెల్లడించింది. అయితే ఈ కామెంట్స్ తాను పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్ మాత్రం ఇలాంటివి ఆపకపోతే రాబోయే రోజుల్లో నీకే నష్టం అంటూ అడుగుతున్నారని వెల్లడించింది.. అతడు ఒక బిజినెస్ మ్యాన్ అయినా కూడా తనని ఏదో ఒక ఈవెంట్ కు పిలిచిన తాను వెళ్లకపోగా..ఇతర ఫంక్షన్లకు వెళ్లగా.. ఫోటోల పైన బ్యాడ్ కామెంట్స్ పెట్టేలా చేస్తున్నారని తెలియజేసింది. తాను వెళ్లిన ప్రతి చోటికి వస్తు  ఆ ఫోటోల పైన బ్యాట్ కామెంట్ స్ చేయిస్తున్నారని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: