సెన్సేషన్ డైరెక్టర్ శంకర్‌కు .. ముప్పు తిప్పలు పెట్టిన తెలుగు హీరోలు వేరే.. గట్టిగానే దెబ్బ కొట్టారుగా..!

Amruth kumar
ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ దర్శకుడు ఎవరంటే రాజమౌళి పేరు మాత్రమే వినిపిస్తుంది .. కానీ 10 , 20 ఏళ్ల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు  .. ఆ సమయంలో శంకర్ ఇండియన్ స్టార్ దర్శకుడు .. అద్భుతమైన సినిమాలను తెరపైకి తెచ్చాడు ..  ఆయన సినిమాలో పాటలు , మేకింగ్ ఎంతో రిచ్ గా ఉంటాయి .. శంకర్ యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ సినిమాల తో పోల్చేవారు .. ఆయన సినిమాలు ఇప్పటికీ బాలీవుడ్ లో సంచలనాలు సృష్టించాయి .. అయితే ఇటీవల శంకర్ రేంజ్ కాస్త తగ్గింది .. అలాగే శంకర్ దగ్గర నుంచి వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా మెప్పించలేకపోతున్నాయి .. చివరిగా శంకర్ తెర్కక్కించిన భారతీయుడు 2 సినిమా ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరిచింది ..

 అయితే చాలామంది స్టార్ నటులతో సినిమా చేయడానికి ప్రయత్నించి విఫలమైనట్టు శంకర్ స్వయంగా చెప్పుకు వచ్చాడు . రజనీకాంత్ , కమలహాసన్ , విజయ్ వంటి ఎందరో అగ్ర నటులతో సినిమాలు చేసిన శంకర్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు .. ఇక అందుకోసం ఎన్నోసార్లు ప్రయత్నించిన అది కుదరలేదు .. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాతో సంక్రాంతి కానుకగా జనవరి 10న అంటే మరి రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు . అయితే చిరంజీవి నే కాకుండా మరో తెలుగు స్టార్ హీరో మహేష్ బాబుతో కూడా సినిమా చేయాలని శంక‌ర్‌ ప్రయత్నించాడు .. కానీ అది కూడా కుదరలేదు ..

సినిమా కథ నచ్చినప్పటికీ పలు అనుకోని కారణాలతో ఈ సినిమా సెట్ కాలేదని అంటారు .. ఇక ఇవి మాత్రమే కాకుండా కోవిడ్ సమయంలో పాన్ ఇండియా హీరో ప్రభస్ తో కూడా శంకర్ ఓ సినిమా చేయాలని భావించాడు .. ఆ సమయంలో ఓ కథను కూడా ఆయనకు చెప్పాడు .. ఇది కూడా పలు అనుకోని కారణాలవల్ల ఈ సినిమా కూడా ముందుకు వెళ్ళలేదు .. ఇప్పుడు ఇన్ని రోజులకు రామ్ చరణ్ కోసం శంకర్ గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాను తెరకెక్కించాడు .. పొలిటికల్  థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న సినిమా కావటం తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి .. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు .. రాజకీయ నాయకుడు ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ నటన  మరో లెవల్లో ఉంటుందని అందరూ చెప్తున్నారు .. ఇక మ‌రి శంకర్ గేమ్ చేంజర్ సినిమాతో అయినా ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: