"నవ్వుతూ ఆ విషయాని కన్ఫామ్ చేసిన చరణ్".. ఆమ్మో ఈ హీరో లో మస్తు షేడ్స్ ఉన్నాయే..!

Thota Jaya Madhuri
"గేమ్ ఛేంజర్" సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ముందుగానే రామ్ చరణ్ సినిమాని ప్రశంసించేస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే . కాగా "వినయ విధేయ రామ" సినిమాలో ఫస్ట్ టైం జత కట్టిన ఈ జంట బాగా వాళ్ల కెమిస్ట్రీకి మార్కులు వేయించుకుంది . ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో సందడి చేయబోతున్నారు ఈ జంట . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రామ్ చరణ్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.


తాజాగా సల్మాన్ ఖాన్ హౌస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కు హాజరయ్యారు కీయరా అద్వానీ - రాంచరణ్ . ఈ సందర్భంగా కీయారా ఆ షో తెలుగులో మాట్లాడి అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది . "నేను మిమ్మల్ని కలిసాక చాలా మంచిగా అనిపించింది" అంటూ సల్మాన్ ని చూసి కీయర తెలుగులో చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది . వెంటనే సల్మాన్ వారెవ్వా అంటూ పొగిడేస్తాడు.  ఆ సమయంలో చరణ్ పక్కనే ఉంటాడు . అతడు నాట్ బ్యాడ్ అంటాడు.  అయితే సల్మాన్ వెంటనే చరణ్ వైపు చూస్తూ .."ఏం చరణ్ ఈ తెలుగు నువ్వు నేర్పించావా..?" అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తాడు.


"నవ్వుతూ అనే రేంజ్ లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు చరణ్'.  అయితే రామ్ చరణ్ ఇంతవరకు ఏ హీరోయిన్ తో ఎక్కువగా మింగిల్ అయిన సందర్భాలే లేవు . సినిమా షూటింగ్ వరకు అలా ఉండి ఆ తర్వాత ఆ హీరోయిన్ తో దూరంగా ఉంటాడు. కానీ కీయరా అద్వానీ అంటే సో స్పెషల్ . ఎందుకంటే కీయర అద్వానీ, రామ్ చరణ్ ఇంటికి కూడా వెళ్లి ఆయన బెడ్ రూమ్ లోకి కూడా వెళ్లి గేమ్స్ ఆడే అంత చనువున్న హీరోయిన్ . మరి ముఖ్యంగా ఉపాసనకి మంచి ఫ్రెండ్స్ కూడా..


రామ్ చరణ్ బెడ్ రూమ్ లో నుంచి వ్యూ బాగుంటుంది అంటూ స్వయాన ఉపాసననే రామ్ చరణ్ బెడ్ రూమ్ కి తీసుకెళ్లి మరి వ్యూ చూపించింది అన్న వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి.  అయితే అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఒక హీరోయిన్ కి తెలుగు నేర్పించాడు అన్న విషయం ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆ లక్కీ ఛాన్స్ అందుకున్న హీరోయిన్ కీయరా అంటూ మెగా ఫాన్స్ కూడా కీయరాను ఓ రేంజ్ లో లక్కీ బ్యూటీగా పొగిడేస్తున్నారు . కొంతమంది తెలుగు హీరోయిన్స్ తెలుగు వచ్చినా కూడా తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడతారు అని .. నువ్వు హిందీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నావు అని ..తెలుగులో నీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పుకు వస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: