కియారా తెలుగు ట్యూటర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali krishna
స్టార్ హీరో రామ్ చరణ్  నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజా ట్రైలర్ లో 'నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్‌.. నేను చనిపోయే వరకు ఐఏఎస్‌' ‍అనే డైలాగ్‌ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.ట్రైలర్ చివర్లో వచ్చే 'అర్థమయిందిరా.. రా కి రా.. సర్‌ కి సర్‌..' అనే డైలాగ్‌ ఎస్‌జే సూర్యతో చెప్పే డైలాగ్‌ మెగా ‍ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. దాదాపు 2 నిమిషాల 40 సెకన్ల పాటు ఉన్న గేమ్ ఛేంజర్‌ ట్రైలర్‌లో ఫైట్స్, విజువల్స్‌లో డైరెక్టర్ శంకర్‌ మార్క్ కనిపిస్తోంది.కాగా గేమ్ ఛేంజర్ పొంగల్ కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీలో బాలీవుడ్ భామ కియారా ‍‍అద్వానీ హీరోయిన్‌గా నటించింది. కోలీవుడ్ హీరో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.ఇదిలావుండగా రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలో హిందీ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ 18 సీజన్ జరుగుతుంది. శనివారం రానున్న వీకెండ్ ఎపిసోడ్ లో గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, కియారా అద్వానీ రానున్నారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. 

తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలోహౌస్ లోకి వెళ్లి అక్కడ కంటెస్టెంట్స్ తో డమ్ చార్డ్స్ గేమ్ ఆడించారు చరణ్, కియారా. అలాగే రోప్ ఫైట్ గేమ్ కూడా కంటెస్టెంట్స్ తో కలిసి ఆడారు.ఈ సందర్భంగా కియారా ఆ షోలో తెలుగు మాట్లాడి సంచలనమైంది. 'నేను మిమ్మల్ని కలిసాక చాలా మంచిగా అనిపించింది అంటూ సల్మాన్ ఖాన్ ని చూసి కియారా చెబుతుంది. వెంటనే సల్మాన్ వారెవ్వా అంటాడు. ఆ సమయంలో చరణ్ పక్కనే ఉన్నాడు. అతడు నాట్ బ్యాడ్ అంటాడు. సల్మాన్ వెంటనే చరణ్ వైపు చూస్తాడు. ఏం చరణ్ ఈ తెలుగు నువ్వు నేర్పించావా? అన్నట్లో ఓ ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు. చరణ్ కూడా ఊకొడతాడు.ఇంత వరకూ రామ్ చరణ్ ఏ హీరోయిన్ కు ఇలా తెలుగు నేర్పించలేదు. తొలిసారి ఆ ఛాన్స్ కియారా కొట్టేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: