వార్నీ.. గేమ్ చేంజర్ ని శంకర్ ఆ తెలుగు హీరోతో చేయాలనుకున్నాడా..? ఎందుకు రిజెక్ట్ చేశాడు అంటే..?

Thota Jaya Madhuri
సాధారణంగా డైరెక్టర్స్ ఒక కథను రాసుకున్నప్పుడు..  ఒక కథను విన్నప్పుడు.. రకరకాల హీరోల పేర్లు మదిలో తడుతూ ఉంటాయి. కానీ టోటల్ కధ  విన్నాక ఈ హీరోకి ఈ కధ బాగుంటుంది అంటూ చాలామంది చెప్పినా కూడా ఆ డైరెక్టర్ నమ్మిన దానికి ముందుకు వెళుతూ ఉంటాడు . అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రం ఆ హీరో ఆ కథను రిజెక్ట్ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో వేరే హీరో ఆప్షన్ ని పెట్టుకుంటూ ఉంటారు డైరెక్టర్ లు. ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటి ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది .


"గేమ్ చేంజర్".. మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది . ఇప్పటికి థియేటర్స్ వద్ద మెగా ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంది . మరి ముఖ్యంగా గేమ్ చేంజర్ తో పుష్ప2  రికార్డ్స్ బద్దలు కొట్టబోతున్నాడు రామ్ చరణ్ అంటూ ఓ రేంజ్ లో బాగా మాట్లాడుకుంటున్నారు మెగా అభిమానులు.  అయితే "గేమ్ చేంజర్" కి అంత సీన్ లేదు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను మొదటిగా డైరెక్టర్ శంకర్ ..రామ్ చరణ్ తో కాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించాలి అంటూ ఆశపడ్డారట .


జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ కథలో నటిస్తే ఖచ్చితంగా బాగా క్లిక్ అవుతుంది అంటూ అనుకున్నారట.  కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ కథను సున్నితంగా రిజెక్ట్ చేశారట . కథలో కొన్ని పొలిటికల్ యాంగిల్స్ ఉండడమే అందుకు కారణం అంటూ కూడా ఓ విషయం బయటకు వచ్చింది. పొలిటికల్ పరంగా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండేందుకు తారక్ ఈ కథను రిజెక్ట్ చేసారట . ఒకవేళ తారకే ఈ సినిమాను ఒప్పుకొని ఉంటే మాత్రం నిజంగా అది ఒక సెన్సేషన్ అయి ఉండేది . తారక్ ని ఎప్పటినుంచో పొలిటికల్ లీడర్ గా చూడాలి అనుకుంటున్నారు జనాలు.  కానీ అది ఏ సినిమాలోనూ కుదరడం లేదు . ఫ్యూచర్ లోనైనా ఆ కోరిక నెరవేరుతుందేమో చూద్దాం..???

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: