ఆ స్టార్ హీరోతో సినిమా .. ట్రోల్స్ తట్టుకోలేక డిప్రెషన్‏లోకి వెళ్లిన క్రేజీ హీరోయిన్ ఎవరంటే..?

Amruth kumar
ప్రస్తుతం టాలీవుడ్  లో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ . చేతినిండా సినిమాల తో ఫుల్ బిజీ గా ఉంది . కానీ ఒకానొక సమయంలో తన సినిమా గురించి ట్రోల్స్ రావడం తో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట . సోషల్ మీడియాలో తన గురించి వచ్చిన ట్రోల్స్ , కామెంట్స్ చూసి ఎంతో బాధపడినట్లు చెప్పుకొచ్చింది . ఇంతకీ ఆమె ఎవరంటే ..ప్రజెంట్ టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో మీనాక్షి చౌదరి కూడా ఒకరు .. గతేడాది లక్కీ భాస్కర్ సినిమా తో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది .. ప్రజెంట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్ల లో  బిజీగా గడుపుతుంది మీనాక్షి ..

జనవరి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది . డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ హీరో గా నటిస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం .. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్ల గా నటించారు .. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి . అయితే ఈ సినిమా ప్రమోషన్ల లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది .. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి  నటించిన గోట్ సినిమాలో హీరోయిన్గా నటించిన మీనాక్షి ..

ఆ తర్వాత తనపై సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్స్ వచ్చాయని ఆ వీడియోలు చూసి తాను ఎంతో బాధపడినట్లు ఆమె చెప్పకు వచ్చింది .. ఆ ట్రోల్స్ వల్ల దాదాపు వారం రోజుల పాటు తాను డిప్రెషన్ లోకి వెళ్లానని కూడా చెప్పింది. ఆ తర్వాత లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ అయి మంచి విజయం అందుకుందని అందులో తన నటనకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయని .. కథల ఎంపికలో మార్పులు చేయాలని అప్పుడే తాను నిర్ణయించుకున్నట్లు మీనాక్షి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: