దర్శక ధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు SSMB 29 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు షురూ అవుతుందా అని మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో సినిమాపై మొదటి నుంచి చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని గోవాలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందట. ఇక మహేష్ బాబు కూడా మొదటి షెడ్యూల్లో పాల్గొని కొన్ని సీన్స్ ను చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఆ తర్వాత మరో రెండు మూడు నెలల గ్యాప్ ఇచ్చి విదేశాల్లో ఈ సినిమా షూట్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా 2027 వ సంవత్సరంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే రెండు పార్టు లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే మహేష్ బాబు మాత్రం ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే భారీ డేట్స్ ని కూడా ఈ సినిమా మీద కేటాయించినట్టుగా తెలుస్తోంది.ఈ క్రమంలో నే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది.ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ SSMB 29ను రిలీజ్ చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహేశ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం మహేశ్ ఇప్పటికే సన్నద్ధమయ్యారు.