ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న చిత్రాల్లో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రాలలో ఒకటి విక్టరీ వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం. గత పదేళ్లుగా ఏ వెంకటేష్ సినిమాకి లేనంత క్రేజ్ ఈ చిత్రానికి ఉంది. అందుకు ముఖ్య కారణాలలో ఒకటి అపజయం అనేదే ఎరుగని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకటి అయితే, మరొకటి ఈ చిత్రం లోని పాటలు. భీమ్స్ స్వరపర్చిన ప్రతీ పాట యూట్యూబ్ లో బాంబు లాగా పేలింది. ముఖ్యంగా రమణ గోగుల పాడిన గోదారి గట్టు మీద రామచిలకవే అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఈ పాటకు యూట్యూబ్ లో 77 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. త్వరలోనే వంద మిలియన్ మార్కుని కూడా అందుకోనుంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.ఇదిలావుండగా ఈ రోజుల్లో సినిమాలు చేయడం చాలా ఈజీయేమో గానీ దాన్ని ప్రమోట్ చేసుకోవడమే పెద్ద తలనొప్పిగా మారుతుంది. అందులో ఆరితేరిన వాళ్లే కలెక్షన్ల వేటలో ముందుంటున్నారు. ఈ విషయంలో అందరికంటే రెండాకులు ఎక్కువే చదివారు అనిల్ రావిపూడి. ఖర్చు లేకుండా నిర్మాతకు ప్రమోషన్ చేసి పెడుతున్నారీయన.అలాగే వెంకటేష్ లాంటి హీరోతో కూడా ప్రమోషన్స్ చేయిస్తున్నాడు. లైఫ్ లో ఇప్పటివరకు వెంకటేష్ ఎప్పుడు ఒకసారి కూడా రీల్స్ అయితే చేయలేదు.
కానీ ఇప్పుడు మాత్రం అటు భార్య ఇటు మాజీ లవర్ మధ్యలో నలిగిపోయే పాత్ర లో వెంకటేష్ ఎలాంటి ఇబ్బందులు పడబోతున్నాడు అనే విషయాన్ని రీల్స్ రూపంలో ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా ప్రతి విషయాన్ని ప్రమోషన్స్ ద్వారానే తెలియజేస్తున్నారు. ఉదాహరణకి సాంగ్ రిలీజ్ చేసిన ప్రమోషన్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ చేసిన ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నారు. ఇక ఇది ఏమైనా కూడా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.ఇక ఈ విషయంలో అనిల్ రావిపూడి రాజమౌళి ని అనుసరిస్తున్నాడని కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా సినిమా అల్టిమేట్ గా సూపర్ సక్సెస్ అయితేనే దర్శకుడికి మంచి గుర్తింపైతే లభిస్తుంది. దానివల్ల ఆయన ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే అటు వెంకటేష్ కెరీర్ అనేది మరోసారి గాడిలో పడుతుంది.నిజానికి పండగ సినిమాలు మూడు పోటీ పడి మరీ ప్రమోట్ చేసుకుంటున్నారు.బడ్జెట్ పరంగా అయినా.. బిజినెస్ పరంగా అయినా.. సేఫ్ జోన్‌లో ఉన్నది అనిల్ రావిపూడి సినిమానే. మొత్తానికి ఈయన దూకుడు మామూలుగా లేదిప్పుడు. అలాగే వెంకీ, అనిల్ కాంబోలో గత రెండు సినిమాలు సంక్రాంతి బ్లాక్ బస్టర్స్.