ఆ వీడియో లు డిలీట్ చేయండి.. కోర్టుకెక్కిన టాలీవుడ్ నటి
జులై 21, 2023 లో విడుదలైన ‘హాస్టల్ హుడుగరు బేకాగిద్దారె’ అనే కన్నడ సినిమాలో తన అనుమతి లేకుండా తన వీడియోలను వాడుకున్నారని నటి రమ్య తెలిపింది. ఈ సినిమా విడుదలకు ముందు కూడా తాను నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపింది. సినిమా ట్రైలర్‌తోపాటు సినిమాలోని పుటేజీలో కొన్ని సన్నివేశాలను కూడా తన ప్రమేయం లేకుండా వాడారని ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ విషయమై నిర్మాతలకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన తన సీన్లు తొలగించడం చేయలేదని తెలిపింది. అలాగే ఎలాంటి యాక్షన్ తీసుకోవడం కానీ చేయలేదని రమ్య ఆరోపించింది. సినిమాలోని తన సన్నివేశాలను తొలగిస్తే కేసును వెనక్కి తీసుకుంటానని కూడా రమ్య చెప్పింది.
ఇక ఈ బ్యూటీ అభిమన్యు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆమె చిత్ర పరిశ్రమలో నటిగా ఓ వెలుగు వెలిగింది. రమ్య తన అందం, అభినేయంతో అందరి మనసు దోచుకుంది. ఈమె కన్నడతో పాటు తెలుగులో కూడా అనేక సినిమాల్లో నటించారు. శాండిల్‌వుడ్ క్వీన్‌గా గుర్తింపు పొందిన రమ్య తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం నటి రమ్య రాహుల్ గాంధీ సూచనలతో కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆతర్వాత ఆమె ఒకసారి ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ రమ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.