సీఎం రేవంత్ దెబ్బకు దిగొచ్చిన నాగార్జున..!!
తెలంగాణ ప్రభుత్వం సినీ రంగం డెవలప్మెంట్ కోసం ఏమి కావాలన్నా చేస్తుంది.అయితే దానికి బదులుగా సినీమా వారు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని అలాగే తెలంగాణాకి పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా తెలంగాణ ప్రాముఖ్యత గురించి వివరించేందుకు సినీ పెద్దలు చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.దీనికి సినిమా వారు అంతా అంగీకరించారు.దీనితో ఆ ఇష్యూ అంతటితో ముగిసింది.ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ రేట్స్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ టూరిజంపై హీరో నాగార్జున ఓ వీడియో విడుదల చేసారు.పర్యాటకులు తెలంగాణకు రావాలని ఇక్కడ అందమైన ప్రదేశాలు ఉన్నాయని చెప్పారు.నేను చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగాను.ఇక్కడ ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు వున్నాయి.ఇరానీ చాయ్,కరాచీ బిస్కేట్ ,హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మీరంతా రండి తెలంగాణలో ప్రతి ప్రాంతాన్ని ఆస్వాదించండి అని నాగార్జున పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున కుటుంబాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టిన నాగార్జున సినీ సమస్యలు తీర్చేందుకు ముందుకొచ్చారు.