గేమ్ ఛేంజర్ : నిజంగా అన్ ప్రిడక్టబుల్.. సాంగ్ అదిరిపోయిందిగా..!!

murali krishna
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీకాంత్‌, ఎస్‌జే.సూర్య, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడులైన పాటలు, ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.తాజాగా ఈ సినిమా నుంచి బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే ‘అన్‌ప్రెడిక్టబుల్' సాంగ్ రిలీజ్ చేశారు. హీరో ఎలివేషన్స్ బ్యాక్ గ్రౌండ్‌లో ఈ సాంగ్ ఉండనుంది. ఈ పాటను అద్వితీయ, బ్లేజ్ రాయగా సంగీత దర్శకుడు థమన్, బ్లేజ్ పాడారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. జనవరి 9వ తేదీ రాత్రి 1 గంట ఆటతో సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.ఇదిలావుండగా ట్రైలర్ తర్వాత భారీ హైప్ అందుకున్న ఈ చిత్రం నిర్మాత దిల్ రాజు ట్రైలర్ రెస్పాన్స్ తో ఖుషీగా గా ఉన్నారు.

ఇలా మరింత ఎనర్జిటిక్ గా ప్రమోషన్స్ లో తాను పాల్గొంటుండగా లేటెస్ట్ తాను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.తాము ట్రైలర్ లో కొంచెం చూపించాం అని దర్శకుడు శంకర్ సినిమాలో ఇంకా కీలకమైన సీన్స్ అలాగే ఎన్నో అన్ ప్రిడిక్టబుల్ మూమెంట్స్ ని సెట్ చేసారని అవన్నీ రేపు జనవరి 10న థియేటర్స్ లో ట్రీట్ ఇస్తారని దిల్ రాజు అంటున్నారు. దీనితో గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కి సాలిడ్ ట్రీట్ రాబోతుందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మొత్తం పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.ఇదిలావుండగా రామ్ చరణ్ 2019 లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ తర్వాత చరణ్ సోలో హీరోగా చేసిన సినిమా ఇదే.అంటే దాదాపు 5 ఏళ్ళ తర్వాత చరణ్ సోలో హీరోగా చేసిన సినిమా అనమాట.’ఆర్.ఆర్.ఆర్’ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ‘గేమ్ ఛేంజర్’ లో మూడు రకాల షేడ్స్ కలిగిన పాత్రలు చేశాడు. అతని కోసం కూడా కచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: