' గేమ్ ఛేంజర్ ' ప్లస్‌లు ( + )... మైనస్‌లు ( - ) ఇవే... సినిమాకు ఏవి ఎక్కువ.. ఏవి తక్కువ...?
ప్లస్ పాయింట్స్ ( + ) :
- రామ్ చరణ్ అద్భుతమైన నటన, డ్యాన్స్ తో పాటు థమన్ నేపథ్య సంగీతం చాలా సీన్ల ను బాగా ఎలివేట్ చేసిందనే టాక్ వచ్చింది. ఇక సీనియర్ నటి అంజలి పాత్ర సినిమా లో మేజర్ హైలెట్స్ లో ఒకటిగా చెపుతున్నారు. ఆమె అప్పన్న కు జోడీగా వృద్ధురాలి పాత్రలో జీవించిందనే చెపుతున్నారు. శ్రీకాంత్ యాక్టింగ్ ... ప్లాస్ బ్యాక్ ఎపిసోడ్ 30 నిమిషాలు సినిమా కు మేజర్ హైలెట్స్ లోనే ఒకటి
మైనస్ పాయింట్స్ ( – ) :
గేమ్ ఛేంజర్ సినిమా గా కొంత వరకు బాగున్నా ... కథలో మరీ కొత్తదనం లేకపోవడం మైనస్. అలాగే దర్శకుడు శంకర్ స్క్రీన్ ప్లేలో మిస్ అయిన మ్యాజిక్ కూడా మైనస్సే .. ఇక సినిమా లో లాజిక్ లేని కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. హీరోయిన్ కియారా అద్వానీ పాత్ర పెద్దగా ఇంఫాక్ట్ చూపలేదు. కొన్ని రొటీన్ సీన్లు కూడా ఉన్నాయి.