ఒకే ఒక్క సన్నివేశంలో అదరగొట్టిన బ్రహ్మీ.. కామెడీ టైమింగ్ కేకో కేక!
'గేమ్ ఛేంజర్'లో బ్రహ్మానందం విజయనగరం జిల్లా కలెక్టర్‌గా కనిపించారు. ఆయనకు సినిమాలో కొన్ని డైలాగులు మాత్రమే ఉన్నా, తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఒక్క సీన్‌తోనే బ్రహ్మానందం తన సత్తా చాటారు. ఆయన చెప్పిన డైలాగులు థియేటర్లలో నవ్వులు పూయించాయి. సినిమా చూసిన వాళ్లంతా బ్రహ్మానందం కామెడీని తెగ పొగిడేస్తున్నారు. బ్రహ్మానందం సీన్ ఒక్కటే చాలు థియేటర్లకు వెళ్లి సినిమా చూడటానికి అని పేర్కొంటున్నారు. బ్రహ్మీ కామెడీ సీన్ వల్ల ఈ మూవీకి మరింత హైప్ వచ్చేస్తోంది. ఇప్పటికీ ఆయన యాక్టివ్‌గానే ఉన్నారు కాబట్టి మరిన్ని పెద్ద సినిమాల్లో కూడా అతని తీసుకునే అవకాశం ఉంది..
ఇకపోతే ఈ సినిమాతో శంకర్ కూడా హిట్ కొట్టినట్టే అని అంటున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉందట. అప్పన్న పోర్షన్ కూడా చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. ప్రస్తుతం వస్తున్న రివ్యూలను బట్టి చూస్తే వారి కోరిక నెరవేరినట్లే కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రం లోపు ఫుల్ రివ్యూ వచ్చాక ఈ మూవీ ఫేట్ ఏంటి అనేది తెలిసిపోతుంది. రామ్ చరన్ ధ్రువ తర్వాత మళ్లీ అంత మంచి హిట్ దీంతో కొట్టడం ఖాయం అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.