గేమ్ ఛేంజ‌ర్ : నానా హైరానా సాంగ్ మిస్‌...ఫ్యాన్స్‌ లో నిరాశ ?

Veldandi Saikiran
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా చేసిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఇవాళ రిలీజ్ అయింది. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి బెన్ఫిట్ షో లు నడుస్తున్నాయి. ముందుగా తెలంగాణ ప్రభుత్వం... వీటికి అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత ఒప్పుకొంది. ఇక... ఈ సినిమా చూసినవాళ్లు అంతా... బాగుందని అంటున్నారు. మరి కొంతమంది సినిమా ఆవరేజ్ గా ఉందని చెబుతున్నారు.
 

అయితే ఈ సినిమా... విషయంలో ఓ మైనస్ పాయింట్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో నానా హైరానా అనే సాంగ్ మిస్ అయింది. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా... ఈ పాటను థియేటర్లలో.. ప్లే చేయలేదు యాజమాన్యాలు. నీతో రాంచరణ్ ఫాన్స్ డీలపడ్డారు. ఈ సాంగ్ ప్లే చేసి ఉంటే... సినిమాకు మంచి ప్లస్ అయ్యేదని అంటున్నారు. ఈ ఒక్క మైనస్ తప్ప సినిమా అంతా బాగుందని అంటున్నారు.
 

కాగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించారు. అలాగే సెకండ్ హీరోయిన్ గా అంజలి... కనిపించడం జరిగింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ను దర్శకుడు శంకర్ తీశారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాలో రాంచరణ్ రెండు పాత్రలో కనిపించారు.
 

ఈ రెండు పాత్రల్లో కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అద్భుతంగా నటించారని చెబుతున్నారు. ఈ సినిమాలో అప్పన్న అలాగే రామ్ నందన్ అనే రెండు పాత్రల్లో...  గ్లోబల్ స్టార్ రాంచరణ్ అదరగొట్టాడు. ముఖ్యంగా సినిమాకు అప్పన్న పాత్ర ప్లస్ అయిందని అంటున్నారు.  అప్పన్న పాత్రకు అవార్డ్స్ కచ్చితంగా వస్తాయని చెబుతున్నారు. ఇక ఇవాళ ఒక్క రోజు 100 కోట్లు ఈ సినిమా వసూలు చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: