గేమ్ ఛేంజర్ రివ్యూ: నానా హైరానా సాంగ్ వచ్చేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
అయితే ఇందులోని పాటల కోసమే కొన్ని కోట్ల రూపాయలు చిత్ర బృందం ఖర్చుచేసింది. అయితే సినిమా చూసిన ప్రేక్షకులకు ఇందులో ఒక మెలోడీ సాంగ్ మిస్ అయిందనే విధంగా గుర్తించారు. నానా హైరానా అని మెలోడీ సాంగ్ లేకపోవడంతో కొంత మంది డిసప్పాయింట్ అయ్యారట. అయితే ఇది థియేటర్లో ప్రదర్శించకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ పాట థియేటర్లో ప్రదర్శించలేదని తెలియజేసినట్లు తెలుస్తోంది.
తాజాగా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వైరల్ చేయడంతో.. చిత్ర బృందం స్పందించినట్లు తెలుస్తోంది.. జనవరి 14 నుంచి నానా హైరానా సాంగ్ ని థియేటర్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశారు. అయితే ఈ సినిమా పాటని ఇన్ఫ్రా రెడ్ కెమెరా తో చిత్రీకరించడంతో ఇలాంటి పాట మొట్టమొదటిసారి చిత్రీకరించామని.. ప్రింటింగ్ ప్రాసెసింగ్ సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని అందుకే ఈ పాటనే ఎడిట్ చేస్తున్నట్లుగా చిత్ర బృందం వెల్లడించినట్లు తెలుస్తోంది. సుమారుగా ఈ పాటల కోసమే రూ .75 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు దిల్ రాజు. నానా హైరానా సాంగ్ థియేటర్లో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి